Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనాథల కోసం రూ.కోట్లు విలువ చేసే ఇంటిని దానం చేసిన హీరో ఎవరు?

పుట్టిపెరిగిన ఇల్లు! చెంగు.. చెంగుమనుకుంటూ చిన్నప్పుడు గెంతిన ఇల్లు! కాయకష్టం చేసి అమ్మ-నాన్న ఇష్టపడి కట్టించుకున్న ఇల్లు. అలాంటి ఇల్లంటే ఎవరికి మాత్రం సెంటిమెంట్ ఉండదూ! పైగా, ఆ ఇంటి నుంచి దూరంగా బయటి

Advertiesment
అనాథల కోసం రూ.కోట్లు విలువ చేసే ఇంటిని దానం చేసిన హీరో ఎవరు?
, గురువారం, 4 మే 2017 (13:33 IST)
పుట్టిపెరిగిన ఇల్లు! చెంగు.. చెంగుమనుకుంటూ చిన్నప్పుడు గెంతిన ఇల్లు! కాయకష్టం చేసి అమ్మ-నాన్న ఇష్టపడి కట్టించుకున్న ఇల్లు. అలాంటి ఇల్లంటే ఎవరికి మాత్రం సెంటిమెంట్ ఉండదూ! పైగా, ఆ ఇంటి నుంచి దూరంగా బయటికి రావాలంటేనే మనసు ఎలానో అయిపోతుంది. కానీ, అలాంటి సెంటిమెంట్లు ఏమీ పట్టించుకోలేదు ఓ హీరో. అనాథ పిల్లలకు కాస్తంత గూడు కల్పించేందుకు తాముపుట్టిపెరిగిన ఇంటినే దానంగా ఇచ్చేశాడు. ఆ హీరో ఎవరో కాదు. సూర్య. ది గ్రేట్ వెటరన్ యాక్టర్ శివకుమార్ తనయుడు. 
 
దీంతో తాను ఒక నటుడినే కాదు... గొప్ప మానవతావిలువలు కలిగిన వ్యక్తినని మరోమారు నిరూపించుకున్నాడు. అగరం ఫౌండేషన్ పేరుతో ఓ స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి.. చాలా ఏళ్లుగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను సూర్య, అతని కుటుంబ సభ్యులు చేపడుతున్నారు. తల్లిదండ్రులు లేక అనాథలుగా మారిన.. పేద కుటుంబాలకు చెందిన వేలాది మంది చిన్నారులకు ఈ సంస్థ చదువు చెప్పిస్తోంది. వారి బాగోగులు చూస్తోంది. చాలామంది లాగా పబ్లిసిటీ కోసం నామమాత్రంగా ఫౌండేషన్ పెట్టి హడావుడి చేయడం కాకుండా.. చాలా సిన్సియర్‌గా అగరంను నడుపుతుందని సూర్య కుటుంబానికి పేరుంది.
 
తాజాగా సూర్య ఫ్యామిలీ ఈ సంస్థ కోసం తాము ఉంటున్న సొంత ఇంటిని రాసివ్వడం చర్చనీయాంశం అవుతోంది. సూర్య తండ్రి శివకుమార్ ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు అది. ఎన్నో ఏళ్లుగా వారి కుటుంబం అక్కడే నివాసం ఉంటున్నారు. సూర్య, కార్తీ పుట్టి పెరిగింది ఈ ఇంట్లోనే. కానీ, ఓ మంచి పని కోసం ఆ సెంటిమెంట్లన్నింటినీ పక్కకు పెట్టేశారు. ఇంటిని అమ్మేయకుండా చారిటీ కోసం దానం చేశారు. 
 
కొన్ని కోట్లు విలువ చేసే ఇంటిని ఇలా చారిటీకి ఇచ్చేయడంతో సూర్యకు, అతడి కుటుంబానికి నలువైపులా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, అగరం ఫౌండేషన్ ద్వారా అనాథ బాలలకు సూర్య ఆశ్రయం కల్పిస్తూ వారి అభ్యున్నతికి చదువు కూడా చెప్పించి శభాష్ అనిపించుకుంటున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లికూతురు కానున్న భావన.. త్రిసూర్‌లో అక్టోబర్ 27న నవీన్‌తో వివాహం..