Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హ‌స్త క‌ళ‌ల నేప‌థ్యంలో వ‌స్తున్న‌ `రాధాకృష్ణ` ఆద‌రించండి: ‌ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Advertiesment
హ‌స్త క‌ళ‌ల నేప‌థ్యంలో వ‌స్తున్న‌ `రాధాకృష్ణ` ఆద‌రించండి: ‌ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి
, బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (16:02 IST)
Radhakrishna, movie, indrakarreddy, etc.
`ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతిగాంచిన నిర్మ‌ల్ కొయ్య‌ బొమ్మ‌ల నేఫ‌థ్యంలో, అంత‌రించిపోతున్న హ‌స్త క‌ళ‌లు, క‌ళాకారుల‌ను వెలుగులోకి తెస్తున్న  ‘రాధాకృష్ణ‌’ చిత్రాన్ని ఆద‌రించాల‌ని` తెలంగాణ‌ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పిలుపు ఇచ్చారు. `ఢ‌మ‌రుకం`ఫేమ్ శ్రీనివాస‌రెడ్డి స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణలో రూపొందుతున్న చిత్రమిది. అనురాగ్‌, ముస్కాన్ సేథీ(పైసా వ‌సూల్ ఫేమ్‌) హీరో హీరోయిన్లుగా నటించ‌గా, నంద‌మూరి లక్ష్మీ పార్వతి ఒక కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్నిహ‌రిణి ఆరాధ్య‌ క్రియేష‌న్స్ ప‌తాకంపై పుప్పాల సాగ‌రిక కృష్ణ‌కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని పాట‌లు ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ‌వుతున్నాయి. ఇప్ప‌‌టికే విడుద‌లైన సాంగ్స్‌, ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఫిబ్ర‌వ‌రి5న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ హైద‌రాబాద్ ద‌స‌ప‌ల్లా హోట‌ల్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, దేవాదాయ‌, న్యాయ‌శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రై `రాధాకృష్ట` మూవీ  బిగ్‌టికెట్‌ను ఆవిష్క‌రించారు. 
 
తెలంగాణ‌రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ - `  పూర్తిగా తెలంగాణలోని నిర్మ‌ల్‌ జిల్లాలోనే చిత్రీక‌రించిన సినిమా అందులోనూ నిర్మ‌ల్ క‌ళాకారుల క‌ష్టాల నేప‌థ్యంలో మంచి ఆశ‌యంతో తీసిన కాబ‌ట్టి త‌ప్ప‌కుండా ఈ విష‌యాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీనుకెళ్తాను. ఈ మూవీ పెద్ద స‌క్సెస్ కావాల‌ని ఆ భ‌గ‌వంతున్ని ప్రార్ధిస్తున్నాను`` అన్నారు.
 
ఏపీ తెలుగు అకాడమీ అధ్యక్షురాలు ల‌క్ష్మీ పార్వ‌తి మాట్లాడుతూ ,  ప్రాచీన క‌ళ‌ల్ని కాపాడుకుంటూ వ‌స్తుంది కాబ‌ట్టే మ‌న భార‌త‌దేశం ప్ర‌పంచ‌దేశాల్లో మ‌కుటాయ‌మానంగా ఉంది. ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని ఎన్నో అద్భుత‌మైన‌ క‌ళ‌ల‌కు భార‌త‌దేశం పుట్టినిల్లు. అంత‌రించి పోతున్న నిర్మ‌ల్ క‌ళ‌ల‌ను క‌థ‌గా తీసుకుని ఒక మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు. ఒక మంచి చిత్రానికి మీ అంద‌రి ఆద‌ర‌ణ త‌ప్ప‌క ఉండాల‌ని కోరుకుంటున్నాను. శ్రీ‌నివాస్ రెడ్డి గారు నాతో ప‌ట్టుబ‌ట్టి ఈ సినిమాలో ఒక  పాత్ర చేయించ‌డం జ‌రిగింది. అలి ఇందులో ఒక మంచి క్యారెక్ట‌ర్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి చిత్రానికి మీ అంద‌రి ఆద‌ర‌ణ త‌ప్ప‌క ఉండాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.
 
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస‌రెడ్డి మాట్లాడుతూ ,  ల‌క్ష్మీ పార్వ‌తిగారు క్యారెక్ట‌ర్ చేయ‌డంతో సినిమాకే ఒక అందం వచ్చింది. రేపు సినిమా రిలీజ‌య్యాక మీరు ఇదే విష‌యం చెప్తార‌ని ఆశిస్తున్నాను. కేవ‌లం ప్రేమ‌క‌థా చిత్రంగానే కాకుండా అంత‌రించి పోతున్న హ‌స్త‌క‌ళ‌ల‌ను బ్ర‌తికించాలి అని ఒక మంచి మెసేజ్ కూడా ఇస్తున్నాం.  కృష్ణ‌భ‌గ‌వాన్‌, అలీ కాంభినేష‌న్లో మంచి కామెడీ ట్రాక్ ఉంటుంది. సురేందర్ రెడ్డిగారు గొప్ప కెమెరామెన్‌. ప్రతి సీన్‌ను ఎక్సలెంట్‌గా విజువలైజ్‌ చేశారు. ఎం.ఎం శ్రీ‌లేఖ‌గారి మ్యూజిక్ ఈ సినిమాకి త‌ప్ప‌కుండా ప్ల‌స్ అవుతుంది` అన్నారు.
 
చిత్ర నిర్మాత పుప్పాల సాగ‌రిక‌ కృష్ణ‌కుమార్ మాట్లాడుతూ  - ``మా నిర్మ‌ల్ జిల్లాలో అంత‌రించి పోతున్న నిర్మ‌ల్ బొమ్మ‌లు, ఆ క‌ళాకారులు ప‌డుతున్న ఇబ్బందుల‌ను గురించి తెలియ‌జేస్తూ ఆ క‌ళ‌ని బ్ర‌తికించాల‌ని ఒక మంచి సంక‌ల్పంతో ఈ చిత్రాన్ని నిర్మించ‌డం జ‌రిగింది. ఫిబ్ర‌వ‌రి 5న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఈ సినిమాని విడుద‌ల చేస్తున్నాం" అన్నారు.
 
చిత్ర ద‌ర్శ‌కుడు ప్ర‌సాద్ వ‌ర్మ మాట్లాడుతూ , ఎం.ఎం. శ్రీ‌లేఖ గారు ఐదు మంచి పాట‌లు ఇచ్చారు. ప్ర‌తిక్ష‌ణం నా వెన్నంటే ఉంటూ ఈ సినిమా ఇంత బాగా రావ‌డానికి ఎంతో స‌హ‌కారం అందించిన మా గురువుగారు శ్రీ‌నివాస్ రెడ్డి గారు ఆయ‌న్ని నా జీవితంలో మ‌ర్చిపోలేను. ప‌ల్లెటూరి నేప‌థ్యంలో ఒక అంద‌మైన ల‌వ్‌స్టోరీతో పాటు హస్తకళలకు సంభందించిన మంచి పాయంట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌డం జ‌రిగింది. త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ న‌చ్చుతుంది`` అన్నారు.
 
సంగీత ద‌ర్శ‌కురాలు ఎం.ఎం శ్రీ‌లేఖ మాట్లాడుతూ - ``రాధాకృష్ణ సినిమా ఒక మ్యూజిక‌ల్ ఫీస్ట్‌లా ఉంటుంది. మంచి పాట‌లు కుదిరాయి‌. సుద్దాల అశోక్ తేజ‌గారు, శ్రీ‌మ‌ణి, చైత‌న్య ప్ర‌సాద్‌, వ‌రికుప్పల యాద‌గిరి లాంటి బిగ్‌ రైట‌ర్స్ ఈ సినిమాకి పాట‌లు రాయడం జ‌రిగింది, రాహుల్ సిప్లిగంజ్‌, మంగ్లీ, అనురాగ్ కుల‌క‌ర్ణి లాంటి బిగ్ సింగర్స్ పాడారు. అంద‌రూ సినిమా చూడండి త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు`` అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాళ్లు రైతులు కాదు.. టెర్రరిస్టులు.. కంగనా రనౌత్