Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోరు భూమిని ముద్దాడాలన్న కోరిక తీరలేదు.. శ్రీలంక పర్యటన రద్దుపై రజనీకాంత్

సుదీర్ఘకాలం పాటు తమ భూమి, ఆత్మగౌరవం, హక్కుల కోసం రక్తం చిందించిన తమిళ త్యాగధనులు సంచరించిన పోరు భూమిని ముద్దాడాలన్న తన కోరిక తీరకుండా పోయిందని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

పోరు భూమిని ముద్దాడాలన్న కోరిక తీరలేదు.. శ్రీలంక పర్యటన రద్దుపై రజనీకాంత్
, ఆదివారం, 26 మార్చి 2017 (10:47 IST)
సుదీర్ఘకాలం పాటు తమ భూమి, ఆత్మగౌరవం, హక్కుల కోసం రక్తం చిందించిన తమిళ త్యాగధనులు సంచరించిన పోరు భూమిని ముద్దాడాలన్న తన కోరిక తీరకుండా పోయిందని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఈలం తమిళుల కోసం కొన్ని సంస్థలు నిర్మించిన గృహాల ప్రారంభోత్సవానికి రజనీకాంత్ ముఖ్యఅతిథిగా హాజరుకావాల్సి ఉంది. అయితే, రజనీ శ్రీలంక పర్యటనపై తమిళ రాజకీయ పార్టీలు తీవ్ర వ్యతిరేకత తెలిపాయి. దీంతో ఆయన తన పర్యటను రద్దు చేసుకున్నారు. 
 
దీనిపై రజనీకాంత్ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. తాను శ్రీలంక వెళ్లి, అక్కడ ఇబ్బందులు పడుతున్న అసంఖ్యాక తమిళులతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని భావించానని, తమిళ మత్స్య కారులపై జరుగుతున్న దాడుల గురించి సిరిసేనకు చెప్పాలని భావించానని తెలిపారు. 
 
అయితే, రాజకీయ కారణాలతో తన పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చిందన్నారు. కానీ, భవిష్యత్తులో మరోసారి తనకు లంక వెళ్లి తమిళులను కలిసే అవకాశం దగ్గరైతే, అప్పుడు మాత్రం రాజకీయ కారణాలతో తనను అడ్డుకోవద్దని రజనీ విజ్ఞప్తి చేశారు. 
 
వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో, తమిళగ వాళ్వురిమై కట్చి అధ్యక్షుడు వేల్ మురుగన్ తదితరులు రాజకీయ కారణాలను చూపుతూ తనను ఆగిపోవాలని కోరారని, ఇష్టం లేకపోయినా, వారి విజ్ఞప్తి మేరకు ప్రయాణాన్ని రద్దు చేసుకున్నానని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్కే.నగర్ బైపోల్ : బాబాయ్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదు : ఇళయరాజ కుమారుడు