Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా కాదు... సూపర్ స్టార్ కృష్ణ

Advertiesment
ఎన్టీఆర్ బయోపిక్ సినిమా కాదు... సూపర్ స్టార్ కృష్ణ
, శనివారం, 12 జనవరి 2019 (16:24 IST)
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి అభిమానుల నుంచి మంచి స్పందన ల‌భిస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని సూప‌ర్ స్టార్ కృష్ణ దంపతులు ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సంద‌ర్భంగా సూప‌ర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ.. నంద‌మూరి బాల‌కృష్ణ రూపొందించిన ఎన్టీఆర్ బ‌యోపిక్ చూశాను. చాలా బావుంది. సినిమా చూసిన‌ట్లు కాకుండా ఒక లైఫ్ చూసిన‌ట్టు అనిపించింది. బాల‌కృష్ణ.. ఎన్టీఆర్‌లా వంద‌ శాతం క‌నిపించారు. ఆయ‌న వేసిన అన్నీ గెట‌ప్స్‌లోనూ బావున్నారు. కచ్చితంగా సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని ఆశిస్తున్నాను అన్నారు.
 
విజ‌య నిర్మల మాట్లాడుతూ... ఈ బయోపిక్‌లో బాలకృష్ణను చూస్తుంటే ఎన్టీఆర్‌ను చూసినట్టే అనిపించింది. సినిమా చాలా బావుంది. చాలా సంతోషం అన్నారు. న‌రేష్ విజయకృష్ణ మాట్లాడుతూ... ఎన్టీఆర్ బ‌యోపిక్ ఎనౌన్స్ అయిన‌ప్పుడు ఈ చిత్రంలో న‌టించే అవ‌కాశం వ‌స్తుందా అని ఆస‌క్తిగా ఎదురుచూశాను. 
 
ఈ బ‌యోపిక్‌లో వేషం వేయాల‌ని న‌న్ను అడిగిన‌ప్పుడు చాలా హ్యాపీగా ఫీల‌య్యాను. అది కూడా బి.ఎ.సుబ్బారావు వేషం. ఆ స‌న్నివేశాల‌ను నేను చేస్తున్న‌ప్పుడు థ్రిల్ ఫీల‌య్యాను. మా అమ్మ తొలి సినిమా ఆయ‌న‌తోనే న‌టించారు. అలాగే నేను ప్రేమ సంకెళ్లు సినిమా స‌మ‌యంలో ఆయ‌న ఆశీర్వాదం తీసుకున్నాను. ద‌ర్శకుడు క్రిష్‌ ఈ సినిమాతో గ్రేట్ డైరెక్టర్ నుండి లెజెండ్రీ డైరెక్టర్ అయ్యారు అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#F2 సినిమా రివ్యూ.. అనిల్ అదుర్స్.. కామెడీతో కడుపుబ్బిపోయేలా చేశాడు..