నమస్కారం తెలుగు ప్రజలారా.. నేను వీరమహాదేవిగా వస్తున్నా: సన్నీ
మంచు మనోజ్‌తో సన్నీ లియోన్ కరెంట్ తీగలో కనిపించిన సన్నీ లియోన్.. ఆపై రాజశేఖర్ గరుడ వేగలో డియో పాటకు స్టెప్పులేసింది. ఇలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సన్నీ లియోన్ తాజాగా, దక్షిణాదిన ఓ లేడి ఓరియెంటెడ్ ప
మంచు మనోజ్‌తో సన్నీ లియోన్ కరెంట్ తీగలో కనిపించిన సన్నీ లియోన్.. ఆపై రాజశేఖర్ గరుడ వేగలో డియో పాటకు స్టెప్పులేసింది. ఇలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సన్నీ లియోన్ తాజాగా, దక్షిణాదిన ఓ లేడి ఓరియెంటెడ్ పాత్రలో కనిపిస్తోంది. ఈ సినిమా వీరమహాదేవిగా రూపుదిద్దుకుంటోంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా లోగో లాంచ్ కార్యక్రమంలో సన్నీ లియోన్ తెలుగులో మాట్లాడి అదరగొట్టింది. ముద్దుముద్దుగా వచ్చీరాని తెలుగులో మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది.
"నమస్కారం తెలుగు ప్రజలారా. నేను 'వీరమహాదేవిగా' మీ ముందుకు వస్తున్నాను.. అంటూ పలికిన సన్నీ మాటల కోసం వీడియోను క్లిక్ చేసే నెటిజన్ల సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. ఆపై సన్నీ "ఐయామ్ వెరీ ఎగ్జయిటెడ్ టూ డూ ది పీరియాడికల్ ఫిల్మ్ వీరమహాదేవి. నేను వీరమహాదేవి" అంటూ సినిమా లోగో పోస్టర్‌ను చూపించింది. నెట్టింట వైరల్ అవుతున్న సన్నీ తెలుగు మాటల వీడియోను మీరూ చూడండి.