Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సునీత సినిమాల్లో నటించేందుకు ఒప్పుకుందా..? అదీ షార్ట్ ఫిలిమ్‌లో..

హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందం.. హావభావాలుండే ఆ గాన సోయగం సునీత. ఆమె పాటకు ఎంతమంది అభిమానులుంటారో ఆమె అందానికి అంతకంటే ఎక్కువ మంది అభిమానులున్నారు. గాయనిగా, డబ్బింగ్ కళాకారిణిగా, యాంకర్‌గా సునీత మంచి

Advertiesment
Sunitha acts in a Short Film
, శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (11:47 IST)
హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందం.. హావభావాలుండే ఆ గాన సోయగం సునీత. ఆమె పాటకు ఎంతమంది అభిమానులుంటారో ఆమె అందానికి అంతకంటే ఎక్కువ మంది అభిమానులున్నారు. గాయనిగా, డబ్బింగ్ కళాకారిణిగా, యాంకర్‌గా సునీత మంచి పేరు కొట్టేసింది. ఆమెతో తమ సినిమాల్లో నటింపజేయడానికి కొంతమంది దర్శక నిర్మాతలు ప్రయత్నించారు. అభిమానులు కూడా ఆమె తెరపైకి రావడం పట్ల ఆసక్తిని కనబరిచారు.
 
అయితే తనకి వచ్చిన అవకాశాలను సునీత సున్నితంగా తిరస్కరించింది. అలాంటి సునీత ఈసారి కెమెరా ముందుకు రావడానికి సిద్ధపడింది. అయితే అది భారీ సినిమా కాదు.. ఓ షార్ట్ ఫిల్మ్. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. చైతన్య శ్రీ పెరంబదూర్ ఈ షార్ట్ ఫిల్మ్‌కి దర్శకుడు. బ్రహ్మోత్సవం సినిమాలో సునీత నటిస్తోందని వార్తలొచ్చాయి. అయితే ఈ ఆ వార్తలను సునీత కొట్టిపారేసింది. తాజాగా షార్ట్ ఫిలిమ్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు కారణం ఏమిటనే దానిపై చర్చ సాగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి-2 రైట్స్ కొనుగోలు చేసిన నాగార్జున.. రూ.8కోట్లకు కొనుగోలు చేశారట!