సందీప్ కిషన్‌తో మహేష్ బాబు సోదరి సినిమా.. సాయిపల్లవి అవుట్.. అమైరా ఇన్
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. కిరణ్, సంజయ్ స్వరూప్ సంయుక్తంగా ఆనందీ ఇందిరా ప్రొడక్షన్ ఎల్ఎల్‌పి పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సందీప్
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. కిరణ్, సంజయ్ స్వరూప్ సంయుక్తంగా ఆనందీ ఇందిరా ప్రొడక్షన్ ఎల్ఎల్‌పి పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ ప్రేమమ్ హీరోయిన్ సాయిపల్లవి కథానాయికగా ఎంచుకోవాలనుకున్నారు.
కానీ ప్రస్తుతం సందీప్ సరసన త్రిధా చౌదరి, అమైరా దస్తూర్‌లు నటించనున్నారు. ఈ సినిమా ఆరంభ వేడుక ఫిలిమ్ నగర్ ఆలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సుధీర్ బాబుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మంజుల ఘట్టమనేని తెరకెక్కించే ఈ సినిమా షూటింగ్ గోవాతో పాటు లండన్‌లో జరుగుతుందని టాక్ వస్తోంది. కాగా మంజులకు ప్రిన్స్ మహేష్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.