హృతిక్ రోషన్ సోదరి ప్రేమ వ్యవహారం.. ఎంతవరకు వచ్చింది?

మంగళవారం, 25 జూన్ 2019 (18:07 IST)
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సోద‌రి సునైనా ఇటీవ‌ల తాను ముస్లిం యువ‌కుడిని ప్రేమిస్తున్నానని, ఆ విష‌యం తెలిసిన త‌న క‌ుటుంబ స‌భ్యులు త‌న‌ను గృహ నిర్భందం చేసారంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఒక వ్యక్తి తానే సునైనా రోష‌న్ ప్రియుడినంటూ, తన పేరు రుహైల్ అమిన్ సోషల్ మీడియాల చెప్పుకొచ్చాడు.
 
సునైనాతో ప్రేమ వ్యవహారంపై ఆయ‌న స్పందిస్తూ `నేను ఇస్లాం మ‌తానికి చెందిన వాడినైనంత మాత్రాన నన్ను తీవ్ర‌వాది అనుకోకండి. తీవ్ర‌వాదం అనేది ఆలోచ‌నా విధానం మాత్ర‌మే. హృతిక్ రోషన్ కూడా ఓ ముస్లిం మహిళను పెళ్లి చేసుకున్నారు క‌దా, అప్పుడు లేని అభ్యంత‌రం ఇప్పుడెందుకు?

ఆమెను అభ‌ద్ర‌తా భావానికి గురి చేస్తున్నారు. ఆమెకొక అవ‌కాశాన్ని ఇచ్చి చూడండి. ఆమె నాతో కొత్త జీవితాన్ని ప్రారంభించాల‌ని అనుకుంటుంది` అన్నారు. ఈ వ్య‌వ‌హారంపై హృతిక్ రోషన్ కుటుంబ స‌భ్యుల నుండి ఎటువంటి స్పంద‌నా లేకపోవడం విశేషం. అయితే ప్రస్తుతం బాలీవుడ్‌లో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం లైట్ తీసుకో పని చూస్కో... హీరో రామ్ స్పందన