Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

Advertiesment
Sumathi Shatakam, Amar Deep

దేవీ

, సోమవారం, 18 ఆగస్టు 2025 (11:07 IST)
Sumathi Shatakam, Amar Deep
అమర్ దీప్, సైలీ హీరో హీరోయిన్లుగా కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘సుమతీ శతకం’. ఈ సినిమాకు ఎం.ఎం. నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం ఈ మూవీ నుంచి హీరోయిన్ సైలీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కృష్ణాష్టమి సందర్భంగా హీరో పాత్రని పరిచయం చేశారు. 
 
అమర్ దీప్ ఇందులో ఓ మిడిల్ క్లాస్ కుర్రాడిలా కనిపించబోతున్నారు. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూస్తుంటే కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని అర్థం అవుతోంంది. అమర్ దీప్ మెడలో కూరగాయలతో అల్లిన దండలు, ఆ బ్యాక్ గ్రౌండ్ వాతావరణం, ఆయన క్యాస్టూమ్స్ ఇలా అన్నీ కూడా ఇదొక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌ అని చెప్పకనే చెప్పేస్తున్నాయి.
 
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. త్వరలోనే టీజర్, ట్రైలర్‌ను కూడా ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతోన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటించాలని మేకర్లు భావిస్తున్నారు. దసరాకి విడుదల చేయాలనే లక్ష్యంతో సినిమా యూనిట్ అహర్నిశలు కష్టపడుతోంది.
 
ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా సుభాష్ ఆనంద్ , డైలాగ్స్ రైటర్‌గా బండారు నాయుడు, ఎడిటర్‌గా నాహిద్ మొహమ్మద్,ఆర్ట్ డైరెక్టర్ గా విశ్వ ప్రసాద్, కెమెరామెన్‌‌గా హాలేష్ పని చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య