Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పీకే తర్వాత రూ.300 కోట్ల క్లబ్‌లోకి కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మ..?!

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ సల్మాన్‌తో రూ.300 కోట్ల క్లబ్‌లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలిసింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించిన సుల్తాన్ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో విపరీతమైన వసూళ్ల

Advertiesment
'Sultan' Crosses Rs 300 Crore Mark Worldwide
, మంగళవారం, 12 జులై 2016 (10:36 IST)
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ సల్మాన్‌తో రూ.300 కోట్ల క్లబ్‌లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలిసింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించిన సుల్తాన్ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో విపరీతమైన వసూళ్లు వస్తున్నాయి. ఈ మూవీతో మరోసారి రూ. 300 కోట్ల క్లబ్‌లోకి అడుగు పెట్టడం ఖాయమనిపిస్తోంది. ఇప్పటికే రూ. 300 కోట్లను పీకే కలెక్షన్ చేసింది. 
 
అమీర్‌తో అనుష్క శర్మ నటించిన ఆ సినిమా.. ఎన్నెన్నో రికార్డులకు బ్రేక్ చేసింది. అయితే ఈ మార్క్‌ను భజరంగీ భాయ్ జాన్ అందుకోగలగింది. సల్మాన్ చేసిన ఈ చిత్రం చాలా రికార్డులను తిరగరాసింది. ప్రస్తుతం రిలీజైన సుల్తాన్ సినిమా ఐదు రోజుల్లోనే రూ. 190 కోట్ల వసూళ్లను రాబట్టేసింది. రెండో వారాంతం చివరికల్లా సుల్తాన్ 300 కోట్లకు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. 
 
అటు సల్మాన్‌కు... ఇటు అనుష్కకు రూ.300 కోట్ల మార్క్‌ను అందించే రెండో సినిమాగా సుల్తాన్ నిలిచిపోనుంది. సుల్తాన్ 300 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టాక.. ఇలా రెండు రూ.300 కోట్ల వసూళ్లు ఉన్న ఏకైక హీరోయిన్ గా అనుష్క శర్మ రికార్డు సృష్టిస్తుందన్న మాట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిపాసా బసు యోగాకు రూ.45లక్షలు డిమాండ్ చేసిందా? నిజమేనా?