Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'బాహుబలి'ని బాలీవుడ్ 'సుల్తాన్' బీట్ చేస్తాడా? 5 రోజుల్లో రూ.200 కోట్ల వసూళ్లు!

కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం సుల్తాన్. ఈ చిత్రం ఇటీవల విడుదలై కాసుల వర్షం కురిపిస్తోంది. తొలి ఐదు రోజుల్లోనే 200 కోట్ల రూపాయల మేరకు వసూలు చేసినట్టు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున

Advertiesment
'బాహుబలి'ని బాలీవుడ్ 'సుల్తాన్' బీట్ చేస్తాడా? 5 రోజుల్లో రూ.200 కోట్ల వసూళ్లు!
, సోమవారం, 11 జులై 2016 (17:03 IST)
కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం సుల్తాన్. ఈ చిత్రం ఇటీవల విడుదలై కాసుల వర్షం కురిపిస్తోంది. తొలి ఐదు రోజుల్లోనే 200 కోట్ల రూపాయల మేరకు వసూలు చేసినట్టు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే, పాకిస్థాన్‌లో అయితే, ఇప్పటివరకు ఏకంగా రూ.150 కోట్ల మేరకు వసూళ్లు సాధించినట్టు సమాచారం.
 
నిజానికి గతంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను అమితాబ్ బచ్చన్ షేక్ చేశాడు. ఇపుడు ఆ పాత్రను సల్మాన్ ఖాన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. 50 ఏళ్ల వయసులో మల్లయోధుడి పాత్రలో జీవించిన సల్మాన్.. వసూళ్ల వర్షం కురిపిస్తుండటంతో బాలీవుడ్ షేక్ అవుతోంది. 'సుల్తాన్' సినిమా విడుదలైన మొదటి ఐదు రోజుల్లోనే రూ.200 కోట్ల కలెక్షన్లకు దగ్గరగా వచ్చేశాడు. 
 
అయితే... ఆలిండియా కలెక్షన్లలో ఆల్టైం రికార్డులు తిరగరాసిన 'బాహుబలి'ని మాత్రం ఇప్పటికి ఇంకా దాటలేకపోయాడు. మొదటి ఐదు రోజుల్లో బాహుబలి గ్రాస్ 320 కోట్ల రూపాయలు కాగా, నెట్ వసూళ్లు రూ.260 కోట్లు. ఇప్పుడు సల్మాన్ మొదటి ఐదు రోజుల్లో తన సుల్తాన్ సినిమాకు రూ.200 కోట్ల వసూళ్లకు దగ్గరైనట్లు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.
 
సల్మాన్కు ఇప్పటివరకు రెండు సినిమాలు మాత్రమే రూ.200 కోట్ల క్లబ్బులో చేరాయి. ఒకటి 'ప్రేమ్ రతన్ ధన్ పాయో', మరొకటి 'కిక్'. ఇక 'బజరంగీ భాయీజాన్' అయితే రూ.300 కోట్లు వసూలు చేసింది. సుల్తాన్ ఇప్పటికే రూ.200 కోట్లకు రావడంతో.. ఇక రూ.300 కోట్లు సాధించడం కూడా కష్టం కాకపోవచ్చని అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూ.ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' మేకింగ్ సాంగ్ డ్యాన్స్ లీక్.. సోషల్ మీడియాలో హల్‌చల్ (వీడియో)