Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుకుమార్‌ శిష్యుడి నూతన ప్రేమకథ.. మంచి సినిమాలకే పని చేస్తా... రసూల్ ఎల్లోర్

విజయ్‌ రామ్‌, శివ్‌ శక్తి సచిదేవ్‌ నటులుగా వి.ఆర్‌. చలనచిత్రాలు బేనర్‌పై ఓ చిత్రం శనివారం హైదరాబాద్‌లో మొదలయింది. ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మెంబర్‌ కె.రామ్మోహన్‌ రెడ్డి

Advertiesment
sukumar's friend news film
, ఆదివారం, 9 అక్టోబరు 2016 (15:48 IST)
విజయ్‌ రామ్‌, శివ్‌ శక్తి సచిదేవ్‌ నటులుగా వి.ఆర్‌. చలనచిత్రాలు బేనర్‌పై ఓ చిత్రం శనివారం హైదరాబాద్‌లో మొదలయింది. ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మెంబర్‌ కె.రామ్మోహన్‌ రెడ్డి స్విచ్చాన్‌ చేశారు. సుకుమార్‌ క్లాప్‌నిచ్చారు. నరేష్‌ గౌరవ దర్శకత్వం వహించారు. థామస్‌ రెడ్డి, విజయప్రసాద్‌ స్క్రిప్ట్‌ ను అందజేశారు. జోనాథన్‌ ఎడ్వర్డ్స్‌ దర్శకుడు. వి.ఇ.వి.కె.డి.ఎస్‌.ప్రసాద్‌ నిర్మాత. 
 
సుకుమార్‌ మాట్లాడుతూ... చిత్ర నిర్మాత, నేనూ ఒకే కాలేజీలో పనిచేశాం. ఇద్దరికీ సినిమాలంటే ఆసక్తి. నాకు రసూల్‌ ఎల్లోర్‌ చాన్నాళ్ల క్రితమే పరిచయం. ఆయన కెమెరా పనితనం నాకు స్ఫూర్తినిచ్చేది. ఈ చిత్ర దర్శకుడు ఐదేళ్ల క్రితం పరిచయమయ్యాడు. అతను తీసిన ఓ షార్ట్‌ ఫిల్మ్‌ నాకు చాలా బాగా నచ్చింది. అంతర్జాతీయ స్టాండర్డ్స్‌లో తీశాడు. అప్పటి నుంచి నాతో ట్రావెల్‌ అవుతున్నాడు. ఆర్జీవీ ప్రభావం అతనిపై చాలా ఉంటుందని తెలిపారు. 
 
రసూల్‌ ఎల్లోర్‌ మాట్లాడుతూ... మంచి సినిమాలకు పనిచేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే వెయిట్‌ చేసి చేస్తున్నానని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ.. చిత్ర దర్శకుడు సుకుమార్‌ ద్వారా పరిచయమయ్యాడు. '100 పర్సెంట్‌ లవ్‌'లో డాక్టర్‌గా నేను ఒక రోల్‌ చేశాను. అప్పటి నుంచే నరేశ్‌ పరిచయమయ్యారు. లవ్‌ ఫీల్‌ ఉన్న చిత్రమిది. రథన్‌ మ్యూజిక్‌ హిట్‌ అవుతుందని అన్నారు. 
 
దర్శకుడు మాట్లాడుతూ... కథానుగుణంగా బ్యాక్‌ గ్రౌండ్‌ పాటలుంటాయి. రియలిస్టిక్‌ లొకేషన్లలో సినిమా చేస్తున్నాం. ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ ఇది. గులాబి, గీతాంజలి, సఖి తరహాలో ఉంటుంది. రెండు షెడ్యూల్లో పూర్తి చేస్తాం. ఈ నెలాఖరున రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలుపెడతామని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా సినిమాలకు రివ్యూలు బాగా రాయరు.. అయినా కలెక్షన్లు బాగా వస్తున్నాయ్ : సునీల్