బాలీవుడ్ బాద్షాగా గుర్తింపు పొందిన షారూక్ ఖాన్‌కు ఓ అందమైన కుమార్తె ఉంది. ఆమె పేరు సుహానా ఖాన్. అపుడపుడూ సోషల్ మీడియా వేదికగా సెక్సీ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె తాజాగా చేసిన ఓ ఫోటోకు కొందరు నెటిజన్లు బూతులు తిడుతూ కామెంట్స్ చేశారు. నీవు అందంగా కాదు.. అబ్బాయిలా ఉన్నాంటూ ట్వీట్ చేశారు. దీనికి సుహానా సున్నితంగా కౌంటరిచ్చింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, సుహానా కొన్నాళ్ల క్రితం చాలా నల్లగా కనిపించేది. తెల్లగా కనిపించడం కోసం ఆమె ఆపరేషన్ చేయించుకుంది. కాస్త అందంగా మారిన తర్వాత తరచుగా ఫొటో షూట్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
అయితే సుహానా ఫొటోలపై కొందరు నెటిజన్స్ నోరు పారేసుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు అందంగా కాకుండా అబ్బాయిలా కనిపిస్తున్నావని, చూడ్డానికి చెండాలంగా ఉన్నావని కామెంట్స్ పెడుతున్నారు.
వీటిని స్క్రీన్ షాట్ తీసి తన సోషల్ మీడియాలో షేర్ చేసిన సుహానా.. చిన్నప్పుడు ఒకలా పెద్దైనప్పుడు ఒకలా ఉండడం కామన్. పెద్దగా మారిన తర్వాత మనలో చాలా మార్పులు వస్తాయి.
ఈ విషయం పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్టు కామెంట్ చేయడం మంచిది కాదంటూ సుహానా కూల్‌గా చెప్పింది. ప్రస్తుతం ఈ అమ్మడికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 1.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.