Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తొలిషెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న సుడిగాలి సుధీర్ G.O.A.T

dir. Naresh Kuppili explin to Sudigali Sudheer
, బుధవారం, 21 జూన్ 2023 (19:23 IST)
dir. Naresh Kuppili explin to Sudigali Sudheer
ప్రముఖ హాస్యనటుడు సుడిగాలి సుధీర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం G.O.A.T  (GreatestOfAllTimes). దివ్యభారతి నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకుడు. మహాతేజ క్రియేషన్స్ పతాకంపై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మిస్తున్నారు.  ఇటీవల హైదరాబాద్‌లో  ఈ చిత్రం తొలిషెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ  ఇటీవల విడుదల చేసిన టైటిల్ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. రీసెంట్‌గా హైదరాబాద్‌లో తొలిషెడ్యూల్‌ను పూర్తిచేశాం. 
 
ఈ షెడ్యూల్‌లో సుధీర్, హీరోయిన్ దివ్యభారతిలపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ ఏపిసోడ్స్‌ను చిత్రీకరించాం. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడుకుండా చాలా రిచ్‌గా చిత్రాన్ని తెరకెక్కిసున్నాం. టెక్నికల్‌గా కూడా చిత్రం చాలా ఉన్నతస్థాయిలో వుంటుంది. సుడిగాలి సుధీర్ కెరీర్‌లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, డీఓపీ: బాలాజీ సుబ్రమణ్యం, ఎడిటర్: కె.విజయవర్థన్, ఆర్ట్: రాజీవ్ నాయర్, రచయిత: ఫణికృష్ణ సిరికి, పీఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సామజవరగమన లో శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ పై హోలా రే హోలా పాట