Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓ ‘ఇంటి’వాడైన సుడిగాలి సుధీర్.. మరి యాంకర్ రష్మి పరిస్థితి ఏంటి?

ఈ తెలుగు చానెల్‌లో ప్రసారమయ్యే 'జబర్దస్త్‌' కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఈ ముదురు బ్యాచిలర్ యాంకర్ రష్మితో ప్రేమాయణం సాగిస్త

ఓ ‘ఇంటి’వాడైన సుడిగాలి సుధీర్.. మరి యాంకర్ రష్మి పరిస్థితి ఏంటి?
, ఆదివారం, 23 అక్టోబరు 2016 (10:44 IST)
ఈ తెలుగు చానెల్‌లో ప్రసారమయ్యే 'జబర్దస్త్‌' కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఈ ముదురు బ్యాచిలర్ యాంకర్ రష్మితో ప్రేమాయణం సాగిస్తున్నట్టు మీడియా కోడై కూసింది. మీడియాకు షాకిస్తూ.. సుడిగాలి సుధీర్ ఓ ఇంటివాడయ్యాడు. ఇంటివాడు కావడమంటే.. బ్యాచిలర్ జీవితానికి స్వస్తి చెప్పి పెళ్లి చేసుకోలేదు. సొంతగా ఓ ఇంటికి యజమాని అయ్యాడు. 
 
ఇప్పటివరకు అద్దె ఇంట్లో గడిపిన సుధీర్ తాజాగా ఓ కొత్త ఇల్లును కొనుగోలు చేశాడు. తన టాలెంట్‌ను గుర్తించి అవకాశం కల్పించిన మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు, ఈటీవీకి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశాడు సుధీర్. అదే విధంగా తనను ఎంతగానో ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టాడు. 
 
మరి 'జబర్దస్త్' యాంకర్ రష్మీతో ప్రేమాయణం అంటూ మొన్నటివరకు వార్తల్లో నిలిచిన సుధీర్.. ఆ విషయంపై క్లారిటీ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సుధీర్‌తో లవ్ ఎఫైర్‌పై బాగా రాయండి అంటూ ఇటీవల రష్మీ కాస్త వెరైటీగా స్పందించడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శివకార్తికేయన్‌ లేడీ గెటప్‌ అదుర్స్‌...