Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

Advertiesment
Sudheer Babu, Sonakshi Sinha

చిత్రాసేన్

, శుక్రవారం, 7 నవంబరు 2025 (16:38 IST)
Sudheer Babu, Sonakshi Sinha
నటీనటులు : సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్, ఇందిరా కృష్ణ
సాంకేతికత: సినిమాటోగ్రాఫర్ : సమీర్ కళ్యాణి, సంగీత దర్శకుడు : రాజీవ్ రాజ్, దర్శకుడు : వెంకట్ కళ్యాణ్ & అభిషేక్ జైస్వాల్, నిర్మాతలు : ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణా అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా
 
కథ:
శివ (సుధీర్ బాబు) ఝాన్సీ, రాజీవ్ కనకాల కొడుకు. కార్పోరేట్ జాబ్ చేస్తున్నా దెయ్యాలపై రీసెర్చ్ చేయాలనే తపన వుంటుంది. అలా తన ఫ్రెండ్స్ తో కలిసి బూత్ బంగ్లాలను వెతుకుతూ దయ్యాల వేట కూడా చేస్తూ ఉంటాడు. దయ్యాలు లేవని అంటూనే ఇలా వెతకడానికి కారణం నిద్రలో ఏవేవో కలలు వస్తుంటాయి. ఈ విషయాన్ని ఓ ప్రొఫెసర్ తో పంచుకుంటాడు. ఆ తర్వాత స్నేహితులతో కలిసి ఓ ఊరిలో పాడుపడిన భవంతిలోకి వెళతాడు. అక్కఢ అతనికి వింత అనుభవం ఎదురవుతుంది. లంకెబిందెలు కోసం క్షుద్రపూజలు చేస్తున్న వారి ద్వారా తన పని తెలుసుకోవచ్చు అనుకున్న అతనికి ఓ ఫోన్ కాల్ రావడం వెనక్కి వచ్చేస్తాడు. ఆ తర్వాత అక్కడ పూజలు చేసేవారంతా చనిపోతారు. విషయం తెలుసుకున్న ఓ సాధువు శివను ప్రతిసారీ మ్రుత్యువు వెంటపడుతుందనే సీక్రెట్ తెలియజేస్తాడు? అలా ఎందుకు జరుగుతుంది? ఇక  ధన పిశాచి (సోనాక్షి సిన్హా) కి శివకు సంబంధం ఏమిటి? అసలు శివ ఎవరు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 
సమీక్ష:
ప్రతీ సినిమాకి ఎంతో సిన్సియర్ గా వర్క్ చేసే సుధీర్ బాబు ఈసారి సస్పెన్స్ థ్రిల్లర్ ను ఎంచుకున్నాడు. ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాతలు తీయడం కూడా ప్రత్యేకత. సోనాక్షి కూడా నటించడం మరో విశేషం. ఇన్ని విశేషాలున్న ఈ కథ మొదటి భాగం సాఫీగా సాగిపోతుంది. సెకండాఫ్ లోనే అసలు కథ మొదలవుతుంది. క్లయిమాక్స్ లో ధన పిశాచి, శివకు మధ్య జరిగే పోరు కీలకం. ఫైనల్ గా చెడుకంటే దైవ బలమే ముఖ్యం అనేది తెలియజేశాడు దర్శకుడు. 
 
సుధీర్ బాబు తన పాత్రకు న్యాయం చేశాడు. సందర్భానుసారంగా తన బాడీని చూపించే సన్నివేశం కూడా ఇందులో వుంది. సోనాక్షి సిన్హాకి తెలుగులో మొదటి సినిమా. గెటప్ బాగుంది. కానీ డాన్స్ చేయడంలో అంతగా ఆకట్టుకోలేదు. డాన్స్ రాకపోయినా నేర్చుకుని శివతాండం సుధీర్ బాబు చేయగలిగాడు.శుభలేఖ సుధాకర్ సాధువుగా నటించాడు. మిగిలిన వారు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
 
కొన్ని మెరుగుపడాల్సిన అంశాలు
సూపర్ నాచురల్ థ్రిల్లర్స్ తో పోలిస్తే జటాధర లో డిఫరెంట్ లైన్ నే కనిపిస్తుంది. దాన్ని చెప్పే విధానంలో సరికొత్తగా కనిపించాలి. అలా చేయడంలో దర్శకుడు కొంత తప్పటడుగు వేశాడు. ఎక్కడా ఆడియన్ థ్రిల్ కలిగించే సీన్స్ లేవు. చాలా వరకు స్క్రీన్ ప్లే ఈ సినిమాలో వీక్ అండ్ సింపుల్ గా అనిపిస్తుంది. సినిమాలో ఆ లవ్ ట్రాక్ ఆసక్తిగా వుండదు. ఐటెం సాంగ్ చొప్పించినట్లుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మరింత గ్రిప్ గా చూపిస్తే బాగుండేది. పెద్ద నిర్మాతలైనా వి ఎఫ్ ఎక్స్ సరిగ్గా ఉపయోగించుకోలేదు.
 
డైరెక్టర్ వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ ఇద్దరు దర్శకులు పని చేసినప్పటికీ ఇద్దరూ సరైన విధంగా కథనాన్ని నడిపించడంలో విఫలం అయ్యారు. చేతిలో మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా మంచి ఎంగేజింగ్ గా సాగే కథనాన్ని వీరు ప్లాన్ చేసుకోలేదు. ఫైనల్ గా చూస్తే, సుధీర్ బాబు మంచి అటెప్ట్ చేశాడు. దర్శకుని లోపం బాగా కనిపిస్తుంది. దాంతో జటాధర సోసో మూవీగా అనిపిస్తుంది. 
రేటింగ్ -2.5/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Rajamouli : క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం అంటూ మహేష్ బాబు సినిమా గురించి రాజమౌళి పోస్ట్