Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సుబ్రమణ్యపురం ట్రైలర్ చూస్తుంటే సినిమా చూడాలనిపిస్తుంది: అఖిల్ అక్కినేని

సుబ్రమణ్యపురం ట్రైలర్ చూస్తుంటే సినిమా చూడాలనిపిస్తుంది: అఖిల్ అక్కినేని
, గురువారం, 22 నవంబరు 2018 (21:09 IST)
భగవంతుడి ఉనికి అనేది నమ్మకం అనే పునాదుల మీద ఉంటుంది. ఆ నమ్మకం లేని వ్యక్తి భగవంతుడిపై చేసే పరిశోధనలు ఎలాంటి ఫలితాలను ఇచ్చాయి. కాపాడవలసిన  భగవంతుడి ఆగ్రహం తట్టుకోవడం సాధ్యం అవుతుందా..? సుబ్రమణ్యపురంలో దాగున్న రహస్యం ఏంటి..? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన  చిత్రం ‘సుబ్రమణ్యపురం’. విజువల్ ఎఫెక్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే  ‘సుబ్రమణ్యపురం’ ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుగా మారింది. 
ఇప్పటికే హిందీ శాటిలైట్, ఓవర్సీస్ మార్కెట్ బిజినెస్ పూర్తి అయ్యాయి. బాహుబలి, గరుడ వేగ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన టీం ‘సుబ్రమణ్యపురం’కు వర్క్ చేసారు. 
 
బాలసుబ్రమణ్యం పాడిన థీమ్ సాంగ్ హైలెట్‌గా నిలుస్తుంది. సెన్సిబుల్ హీరో సుమంత్, ఇషా రెబ్బ జంటగా నూతన దర్శకుడు సంతోష్ జాగర్లమూడి రూపొందించిన ‘‘సుబ్రమణ్యపురం’’ ట్రైలర్ లాంచ్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. అక్కినేని అఖిల్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిల్ అక్కినేని మాట్లాడుతూ... ‘ఇలాంటి కథలు దొరకడం చాలా కష్టం. ఎప్పుడో కానీ ఇలాంటి కథలు సెట్ అవవు. నేను థ్రిలర్స్ చూడటానికి పెద్దగా ఇష్టపడను కానీ ‘సుబ్రమణ్యపురం’ ట్రైలర్ చూస్తుంటే సినిమా చూడాలనిపిస్తుంది. టీం ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి.  భయాన్ని కలిగించకుండా ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయగలిగాడు దర్శకుడు. సుమంత్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఈ సినిమా తప్పకుండా బిగ్ సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను అని అన్నారు.
 
సుమంత్ మాట్లాడుతూ... ‘‘నా లాస్ట్ సినిమాలో నాపేరు కార్తిక్, ఈ సినిమాలో కూడా అదే పేరు లాస్ట్
 సినిమాలాగే ఇది కూడా సక్సెస్ అవుతుందని సెంటిమెంట్ రిపీట్ అవుతుందని నమ్ముతున్నాను. నాకు థ్రిలర్స్ పెద్దగా నచ్చవు కానీ సంతోష్ కథ చెబుతున్నప్పుడు అతని నారేషన్‌కి బాగా ఇంప్రెస్ అయ్యాను. ఇతను చెప్పినది విజువల్‌గా మార్చడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. సినిమా అంతా చూసాను, చాలా కాన్పిడెంట్ గా ఉన్నాను. త్వరలో మీముందుకు రాబోతున్నాం, టీం
అందరికీ నా అభినందనలు’’ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దాంపత్య జీవితం గురించి ఐడియా లేదు.. నచ్చిన వాడు దొరికితే పెళ్లే: టబు