Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క‌థ‌లు, టైటిల్స్‌, సెన్సార్ పబ్లిసిటీ క్లియరెన్స్ అన్నీ హైదారాబాద్ లోనే

క‌థ‌లు, టైటిల్స్‌, సెన్సార్ పబ్లిసిటీ క్లియరెన్స్ అన్నీ హైదారాబాద్ లోనే
, గురువారం, 8 జులై 2021 (19:02 IST)
TFPC
ఆంధ్ర‌, తెలంగాణ విడిపోయాక రెండు చోట్ల సినిమా ఛాంబ‌ర్‌లు వున్నాయి. క‌నుక కొంత‌మంది విజ‌య‌వాడ కేంద్రంగా వున్న ఛాంబ‌ర్‌లో టైటిల్ రిజిస్టేష‌న్ వంటి ప‌నులు చేసుకుంటున్నారు. అందుకే ఇక‌పై అన్నీ హైద‌రాబాద్‌లోనే అని ఛాంబ‌ర్ ప్ర‌క‌టన చేసింది.
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, (తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి) తెలియజేయునది ఏమనగా నిర్మాతల మండలిలో తెలుగు సినిమాల కథలు, అన్ని భాషల సినిమా టైటిల్స్, సెన్సార్ కొరకు పబ్లిసిటీ క్లియరెన్స్ లాంటి పలు సినిమా కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పటికే 30 కథలని, 13 టైటిల్స్ ని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సినిమాలు 1. “ఆకాశవాణి చెన్నై కేంద్రం” (తమిళ డబ్బింగ్ సినిమా) కు పుబ్లిసిటీ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. 2. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన “భూత్ సర్కార్” (హిందీ డబ్బింగ్ సినిమా) సెన్సార్ కూడా పూర్తి చేసుకొని CBFC No. DIL/2/96/2021-HYD DATED 01.07.2021 సెన్సార్ సర్టిఫికేట్ పొందడం జరిగింది.
 
పైన చెప్పిన సౌలభ్యాలు నిర్మాత మండలిలో సభ్యత్వం ఉన్న వారికి ఇవ్వడంజరుగుతుంది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మెంబెర్స్ తో బాటు, తెలంగాణా స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, అఫిలియేటెడ్ అసోసియేషన్స్ లో మెంబెర్షిప్ ఉన్న వాళ్లకి కూడా తెలుగు సినిమా కథలని రిజిస్టర్ చేయడం జరుగుతుంది.
 
ఇవి మాత్రమే కాకుండా నిర్మాతల మండలి నుండి కన్సెషన్ రేట్స్ కు తెలుగు ఫిల్మ్ ట్రైలర్స్ పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. మరియు, ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్స్ తో పాటు TFPC Youtube Channel, TFPC వెబ్సైట్, ఇతర సోషల్ మీడియాలో (Youtube, Facebook, Twitter, Instagram etc) సినిమా పబ్లిసిటీ ఉచితంగా వేయడం జరుగుతుంది. 
ఇవేకాకుండా, అర్హులైన నిర్మాత సభ్యులకు కౌన్సిల్ నుండి మెడి క్లైమ్ ఇన్సురెన్స్, పెన్షన్, ఆర్ధిక సహాయం ఇవ్వడం జరుగుతుంది అంటూ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, గౌర‌వ కార్య‌ద‌ర్శులు టి.ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'జీ 5'లో జూలై 9న ఒరిజినల్‌ మూవీ 'స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌: టెంపుల్‌ అటాక్‌'