Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మలయాళ స్టార్ దిలీప్ బహిష్కరణ.. భావనకు న్యాయం జరిగినట్లేనా?

దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగాయన్నది పాత సామెత. ఇప్పుడు ఈ లేటు స్పందనకు కాలం చెల్లిపోయినట్లే. ఎందుకంటే సినీనటి భావనపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలకు గురైన మలయాళ సూపర్ స్టార్ దిలీప్‌ను పోలీసులు అలా అరెస్టు చేశారో లేదో మలయాల చిత్ర పరిశ్రమ అతగాడ

మలయాళ స్టార్ దిలీప్ బహిష్కరణ.. భావనకు న్యాయం జరిగినట్లేనా?
హైదరాబాద్ , బుధవారం, 12 జులై 2017 (06:33 IST)
దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగాయన్నది పాత సామెత. ఇప్పుడు ఈ లేటు స్పందనకు కాలం చెల్లిపోయినట్లే. ఎందుకంటే సినీనటి భావనపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలకు గురైన మలయాళ సూపర్ స్టార్ దిలీప్‌ను పోలీసులు అలా అరెస్టు చేశారో లేదో మలయాల చిత్ర పరిశ్రమ అతగాడి ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దుచేసి బహిష్కరించింది. పోలీసు విచారణలో పబ్లిగ్గా దొరికిపోయిన ఈ దగుల్బాజీ హీరో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(అమ్మ)కు ఇంతవరకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించడం మరీ ఘోరం. బాధిత నటికి తమ పూర్తి మద్దతు తెలుపుతూ అమ్మ అధ్యక్షుడు మోహన్ లాల్ నేతృత్వంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
కోలీవుడ్‌లో మమ్ముట్టి, మోహన్‌లాల్ తర్వాతి స్థానాన్ని సంపాదించిన స్టార్ హీరో దిలీప్‌ను అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(అమ్మ) బహిష్కరించింది. ప్రముఖ నటిపై లైంగిక దాడి కేసులో దిలీప్ అరెస్టయిన కొన్ని గంటలకే ‘అమ్మ’ ఈ నిర్ణయం తీసుకుంది. మలయాళ సుపర్‌స్టార్ ముమ్మట్టి నివాసంలో ‘అమ్మ’ కమిటీ సభ్యులు మంగళవారం అత్యవసర సమావేశమయ్యారు. ‘అమ్మ’ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ముమ్మట్టి ఆధ్వర్యంలో దిలీప్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయడంతోపాటు కోశాధికారి పదవి నుంచి కూడా అతడిని తొలగించినట్లు మీడియా ముందు ప్రకటించారు. బాధిత నటికి తమ పూర్తి మద్దతును తెలుపుతూ... కేసు విచారణలో ప్రభుత్వ, పోలీసుశాఖ పనితీరును ప్రశంసించారు.
 
‘అమ్మ’ బాటలోనే కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ కూడా దిలీప్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశాయి. అనుమానం వచ్చిన వెంటనే తాత్కాలిక ప్రాతిపదికన దిలీప్ సభ్యత్వాన్ని సస్పెన్షన్‌లో పెట్టి ఉంటే సంస్థ గౌరవం మరింత ఇనుమడించి ఉండేదేమో..
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెరపైనే రెచ్చిపోతున్నాం.. నిజ జీవితంలో తుస్సే.. : దిశా పటానీ