Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతంగా ఉంది... కానీ ఆ ఒక్క నిమిషం నిరాశపరిచింది : రాజమౌళి

Advertiesment
rajamouli

ఠాగూర్

, గురువారం, 20 మార్చి 2025 (12:06 IST)
ఒరిస్సా రాష్ట్రంలోని దేవ్‌మాలీపై దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఆసక్తికర ట్వీట్ చేశారు. దేవ్‌మాలీపై వ్యూ అద్భతంగా ఉందని, కానీ ఒక విషయం తనను తీవ్రంగా బాధించిందని రాజమౌళి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 
 
తన దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం "ఎస్ఎస్ఎంబీ 29" ప్రాజెక్టు చిత్రీకరణలో భాగంగా, ఒరిస్సా రాష్ట్రంలో షూటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా దేవ్‌మాలీపై ట్రెక్కింగ్ అనుభవాన్ని ఆయన షేర్ చేశారు. దేవ్‌మాలీ వ్యూ అద్భుతంగా ఉందని, కానీ ఒక విషయం తనను తీవ్రంగా బాధించిందని ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
 
"ఒరిస్సా రాష్ట్రంలోని అత్యంత ఎత్తైన, అద్భుతమైన శిఖరం దేవ్‌మాలీపై సోలో ట్రెక్కింగ్ చేశాను. శిఖరంపై నుంచి వ్యూ అద్భుతంగా ఉంది. ఆ దృశ్యాలు చాలా ఉత్కంఠభరితంగా, ఇట్టే కట్టిపడేస్తాయి. అయితే, ఇంత సుందరమైన ప్రదేశంలో అపరిశుభ్రత పరిస్థితులు నన్ను తీవ్రంగా బాధించాయి. ట్రెక్కింగ్‌కు వచ్చే సందర్శకులు వారు వాడిన వస్తువులను అక్కడే పడేయకుండా తమతో పాటు తిరిగి తీసుకెళ్లాలి" అని జక్కన్న ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Sreeleela in 2025: గుంటూరు కారం తర్వాత బ్రేక్.. మళ్లీ కొత్త ప్రాజెక్టులతో శ్రీలీల బిజీ బిజీ