Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహాభారతంలో కర్ణపాత్రధారి అమీర్‌ఖాన్.. దమ్మున్న నిర్మాతలు దొరికితే సై అన్న రాజమౌళి

బాహుబలి2 విడుదల ప్రమోషన్ కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటున్న రాజమౌళి మహాభారతం తన తదుపరి కలల ప్రాజెక్టు అని తేల్చి చెప్పేశారు. కానీ ఆ చిత్రం విషయంలో తాను తొందరపడదల్చుకోలేదని, బాహుబలికి మూడు రెట్లు అధ

మహాభారతంలో కర్ణపాత్రధారి అమీర్‌ఖాన్.. దమ్మున్న నిర్మాతలు దొరికితే సై అన్న రాజమౌళి
hyderabad , సోమవారం, 17 ఏప్రియల్ 2017 (03:35 IST)
బాహుబలి2 విడుదల ప్రమోషన్ కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటున్న రాజమౌళి మహాభారతం తన తదుపరి కలల ప్రాజెక్టు అని తేల్చి చెప్పేశారు. కానీ ఆ చిత్రం విషయంలో తాను తొందరపడదల్చుకోలేదని, బాహుబలికి మూడు రెట్లు అధికంగా ఖర్చయ్యే మహాభారత్ ప్రాజెక్టుపై డబ్బు పెట్టడానికి ముందుకొచ్చే ప్రొడ్యూసర్లు కావాలని రాజమౌళి చెప్పారు. బాహుబలి2 చిత్రం విడుదల అయ్యాక ఆరునెలలు ఏ చిత్రం గురించి ఆలోచించకుండా విదేశీ పర్యటనలకు వెళ్లిపోతానని రాజమౌళి చెప్పారు.
 
గతంలో ప్రముఖ హిందీ హీరో ఆమిర్‌ఖాన్‌ను కలసినప్పుడు మహాభారతం గురించే మాట్లాడింది వాస్తవమేనని దర్శకుడు రాజమౌళి స్పష్టం చేశారు. ‘ఇంతకు ముందు చెప్పినట్టు మహాభారతాన్ని చిత్రంగా తీయాలనుంది. తప్పకుండా చేస్తా. కానీ, ‘బాహుబలి’ తర్వాత మాత్రం కాదు. ‘మహా భారతం’ అనేది క్లాసిక్, ఓ ఎపిక్‌. నాకు టైమ్‌ కావాలి. ఆమిర్‌ఖాన్‌తో ‘మహాభారతం’ గురించి చర్చించిన మాట వాస్తవమే. ఈ సినిమా చేయాలని ఆయన కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు’’ అన్నారు.
 
హిందీ సూపర్ హిట్‌ ‘దంగల్‌’ ప్రచార కార్యక్రమాలకు హైదరాబాద్‌ వచ్చిన ఆమిర్‌ను ఇదే అంశమై మీడియా ప్రశ్నించగా... ‘‘రాజమౌళిని ఓసారి కలిశా. కానీ, సినిమా గురించి ఏం మాట్లాడలేదు’’ అన్నారు. ఒకవేళ రాజమౌళి కలల సినిమా ‘మహభారతం’లో ఛాన్స్‌ వస్తే నటిస్తారా అని ఆమిర్‌ను అడగ్గా... ‘‘కృష్ణుడిగా నటించడానికి ఇష్టపడతా’’ అన్నారు.
 
అమితాబ్‌ బచ్చన్, మోహన్‌లాల్, ఆమిర్‌ఖాన్‌ ముఖ్య పాత్రధారులుగా సుమారు 600 కోట్లతో మహాభారతాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మహాభారతంపై సినిమా గురించి రాజమౌళి, అమిర్ ఖాన్ తమ అభిప్రాయాలను పంచుకోవండం ఆసక్తి గొలుపుతోంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు బాహుబలిలో ఆ పాత్రంటేనే ఇష్టం.. కట్టప్ప తక్కువేమీ కాదు: ప్రభాస్