అఘోరీగా మారిన శ్రీరెడ్డి.. నుదుట పసుపు, పెద్దబొట్టు, రుద్రాక్షలతో?

శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (16:17 IST)
Sri Reddy
మహాశివరాత్రిని పురస్కరించుకుని వివాదాస్పద నటి శ్రీరెడ్డి అఘోరీగా మారిపోయింది. మెడలో భారీగా రుద్రాక్ష మాలలు ధరించి.. ఒళ్లంతా భస్మం పూసుకుని హంగామా చేసింది. ఒక చేతిలో ఢమరుకం, మరో చేతిలో కర్ర పట్టుకుని నాట్యం చేయడం మొదలుపెట్టింది.

మరో ఇద్దరు అఘోర వేషగాళ్లతో కలిసి చేసిన ఈ డ్యాన్స్‌ను టిక్ టాక్ వీడియో చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో శ్రీరెడ్డి చాలా భయంకరంగా కనిపిస్తోంది. నుదుట పసుపు, దానిపై పెద్ద బొట్టు, విభూది చూసి ఆమె ఫ్యాన్స్ షాకవుతున్నారు. 
 
ఇకపోతే.. శ్రీరెడ్డి ఇటీవల మరో వివాదంతో వార్తల్లో నిలిచింది. తాను వివాదాలకు దూరంగా ఉంటున్నాను అంటూనే.. తనపై పలు ఇంటర్వ్యూల్లో విమర్శలు, ఆరోపణలు చేసిన రాకేష్ మాస్టర్, కరాటే కళ్యాణిపై శ్రీరెడ్డి విరుచుకుపడింది. ముఖ్యంగా కరాటే కళ్యాణిపై బూతులతో విరుచుకుపడింది.

శ్రీరెడ్డి బూతు పురాణం తట్టుకోలేక కరాటే కళ్యాణి పోలీసుల వద్దకు వెళ్లింది. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తనను అసభ్యకర పదజాలంతో దూషించిందని హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా దంపతులకు ఆడశిశువు.. సరోగసీ ద్వారా..?