Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీను ఐ మిస్ యూ మూవీ లోగో, బ్యానర్, ట్రైలర్ లాంచ్.. ఒక పిచ్చివాడు హృదయాన్ని దానం చేస్తే?

తోట మల్లికార్జున సమర్పణలో శ్రీ సూర్య నారాయణ క్రియేషన్స్ బ్యానర్‌పై రాజేంద్ర ప్రసాద్‌ను దర్శకుడి పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ శ్రీను ఐ మిస్ యూ . శ్రీను నిర్మిస్తున్న ఈ చిత్రం లోగో, బ్యానర్,

Advertiesment
Srinu I Miss U Movie Launch
, బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (19:27 IST)
తోట మల్లికార్జున సమర్పణలో శ్రీ సూర్య నారాయణ క్రియేషన్స్ బ్యానర్‌పై రాజేంద్ర ప్రసాద్‌ను దర్శకుడి పరిచయం అవుతూ  తెరకెక్కిస్తున్న చిత్రం ‘ శ్రీను ఐ మిస్ యూ . శ్రీను నిర్మిస్తున్న ఈ చిత్రం లోగో, బ్యానర్, ట్రైలర్ లాంచ్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ చిత్రం బ్యానర్ లోగోను రామసత్యనారాయణ ఆవిష్కరించగా టైటిల్ లోగోను సాయి వెంకట్, ట్రయిలర్ ను ఆర్ కె గౌడ్ లాంచ్ చేసారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటి కవిత. ప్రతాని రామ కృష్ణ గౌడ్. సాయి వెంకట్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ అతిధులుగా హజరై చిత్రయూనిట్‌ను అభినందించారు.
 
అనంతరం నిర్మాత నటుడు శ్రీను మాట్లాడుతూ.. మొదట షార్ట్ ఫిలిం అనుకున్నాం కానీ.. ఈ కాన్సెప్ట్‌ను దర్శకుడు రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. సినిమా చేద్దాం అన్నాను. దాని దర్శకుడు కూడా సరే అనడంతో ముందుకెళ్తున్నాము. ఈ చిత్రంలో ఓ పాత్ర పోషిస్తున్నాను. అందరూ బాగా చేస్తున్నావ్ అంటున్నారు ఆ ధైర్యంతో త్వరలో షూట్‌కి వెళ్తాము అన్నారు.
 
దర్శకుడు రాజేంద్రప్రసాద్  మాట్లాడుతూ.. నేను దర్శకత్వం చేసే సినిమాలు డిఫరెంట్‌గా ఉండాలని కోరుకుంటాను. శ్రీను గారు కేవలం ట్రైలర్‌కి లక్షలు ఖర్చు పెట్టారు ఆయనలో మంచి నటుడున్నాడు సినిమా పరిశ్రమలో అవకాశం కోసం తిరిగి చివరికి ఆయనే నిర్మాతగా నటుడిగా నిలబడాలని పట్టుదలతో ఈ సినిమా తీస్తున్నారు.. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత శ్రీను గారికి థాంక్స్ అన్నారు.
 
సీనియర్ నటి కవిత... ఈ సినిమా తీసి అవయవ దానం గొప్ప తనం గురించి తెలియచెప్పబోతున్న దర్శకుడు రాజేంద్రప్రసాద్, నిర్మాత నటుడు శ్రీను మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు. ఒక పిచ్చివాడు తన హృదయాన్ని దానం చేయడం ఎంత గొప్ప విషయం. తప్పని సరిగా ఈ సినిమా తీసి ట్రెండ్ సెట్టర్‌గా నిలబడాలని కోరుకుంటున్నాను.
 
ఆర్ కె గౌడ్ మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బాగుంది. సినిమాతో ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది. అలాగే మంచి పబ్లిసిటీ చేసి రిలీజ్ చేయాలని మానుండి ఎటువంటి సహాయం కావాలన్నా మేము రెడీ అన్నారు.
 
రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. నేను రెండు పాయింట్స్ మాట్లాడతాను ఒకటి తీయబోయే సినిమా పాయింట్‌ని ఇలా ప్రదర్శించడం వల్ల దర్శకుడు బాగా తీస్తాడా? శ్రీను నటన ఎలా ఉంటుంది అని మా సమక్షంలో చూసుకోవడం ఎంతో ఉపయోగకరమైన విషయం. రెండు ఒక సినిమా తీసి చేతులు కాల్చుకోవడం కంటే ముందే కొద్దిగా షూట్ చేసుకుని చూసుకోవడం. ఈ పద్దతిని సినిమా తీయబోయే వాళ్ళు అనుసరిస్తే సినిమా పరిశ్రమ బాగుపడుతుంది'' అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహాశివరాత్రికి వస్తున్న ''లక్ష్మీబాంబ్": ఎమోషనల్‌ రోల్‌లో మంచులక్ష్మీ