Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీమంతుడు మూవీ రివ్యూ రిపోర్ట్: మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్.. హిట్టే గురూ..!

Advertiesment
Srimanthudu
, శుక్రవారం, 7 ఆగస్టు 2015 (10:39 IST)
సినిమా- రిలీజ్ తేదీ: శ్రీమంతుడు (07-08-2015)
సినీ నటులు - మహేష్ బాబు, శ్రుతిహాసన్, రాజేంద్రప్రసాద్,  జగపతి బాబు, బ్రహ్మానందం తదితరులు.
దర్శకుడు - కొరటాల శివ 
నిర్మాతలు: వై. నవీన్, వై. రవి శంకర్, సి.వి. మోహన్, మహేష్ బాబు 
సంగీత దర్శకుడు: దేవీ శ్రీ ప్రసాద్ 
సినిమాటోగ్రఫీ : ఆర్ మది
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు 
ప్రొడక్షన్ బ్యానర్స్ : మైత్రీ మూవీ మేకర్స్ 
డిస్ట్రిబ్యూటర్స్: ఎరోస్ ఇంటర్నేషనల్ 
 
దర్శకుడు, రచయిత కొరటాల శివ మిర్చి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. బద్ర, ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం, ఊసరవెల్లి, వంటి సినిమాల తర్వాత మిర్చితో సూపర్ హిట్ కొట్టేసిన శివ శ్రీమంతుడుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తప్పకుండా హిట్టేనని పాజిటివ్ టాక్ వచ్చింది. 
 
కథాసారాంశం : 
మహేష్ బాబు కోటీశ్వరుడు, ధనవంతుడుగా హర్షగా కనిపిస్తాడు. ఇబ్బందుల్లో కనీస వసతులు లేని ఓ గ్రామాన్ని చూశాక అదే గ్రామాన్నే దత్తత తీసుకుంటాడు హర్ష. దత్తత తీసుకోవడంతో సరిపెట్టకుండా.. ఆ గ్రామ ప్రజలకు ఏర్పడే సమస్యల్ని పరిష్కరిస్తూ.. ఆ గ్రామాన్ని ఎలా అభివృద్ధి పథంలో తీసుకెళ్తాడన్నదే అంశమే కథ. 
 
విశ్లేషణ : శ్రీమంతుడికి పాజిటివ్‌ టాక్‌ వినిపిస్తోంది. నేనొక్కడు, ఆగడు ప్లాప్‌ల తర్వాత ఈ మూవీ మహేష్‌కు బూస్ట్‌ ఇచ్చిందని అభిమానులు అంటున్నారు. ప్రీమియర్‌ చూసిన వాళ్లంతా ఫస్ట్‌ ఆఫ్‌ కాస్తా స్లోగా ఉందని సెకండ్‌ ఆఫ్‌ ఇరగదీసిందని అంటున్నారు. 
 
మిర్చి తరహాలో సెకండ్‌ ఆఫ్‌లో హీరోలోని మాస్‌ ఇమేజీని కొరటాల బాగా చూపించాడు. శ్రుతిహాసన్‌ గ్లామర్‌ సినిమాకి హైలైట్‌. మహేష్‌ కూడా శృతిహాసన్‌ కన్నా.. అందంగా కనిపడి అమ్మాయిల మనస్సులను దోచేశాడు. ఈ మూవీకి జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ క్యారెక్టర్లు ప్లస్‌ పాయింట్‌గా నిలిచాయి.

ఇక ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్లతో క్లైమాక్స్ ఉంటుంది. మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా శ్రీమంతుడు హిట్ కొట్టేశాడు. ఈ క్రెడిట్ అంతా మహేష్ బాబు పెర్‌ఫార్మెన్స్ స్టైల్‌కే దక్కుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu