ఎఎన్నార్‌కు ఘంటసాల ఛాన్సిచ్చారు... నిర్మలా కాన్వెంట్ ఆడియో ఫంక్షన్‌లో నాగార్జున
శ్రీకాంత్ కుమారుడు రోషన్ ఎమోషన్ అయ్యాడు. రోషన్ తెరంగేట్రం చేస్తోన్న సినిమా “నిర్మలా కాన్వెంట్”. అన్నపూర్ణ స్టూడియోస్, మాట్రిక్ టీమ్ వర్క్స్, కాన్సెప్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చ
శ్రీకాంత్ కుమారుడు రోషన్ ఎమోషన్ అయ్యాడు. రోషన్ తెరంగేట్రం చేస్తోన్న సినిమా “నిర్మలా కాన్వెంట్”. అన్నపూర్ణ స్టూడియోస్, మాట్రిక్ టీమ్ వర్క్స్, కాన్సెప్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన ఆడియో వేడుక హైదరాబాదులో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా అల్లు అరవింద్, నాగార్జున హాజరయ్యారు.
అల్లు అరవింద్ సీడీని విడుదల చేయగా.. ఆడియో సీడీలను నిమ్మగడ్డ ప్రసాద్ విడుదల చేసి తొలి సీడీని అల్లు అరవింద్‌కు అందజేశారు. అయితే, ఈ ఆడియో వేదికపై శ్రీకాంత్ తనయుడు రోషన్ ఎమోషన్ అయ్యాడు. కన్నీరు పెట్టుకొన్నాడు. తల్లిదండ్రులు గర్వపడేలా, ప్రేక్షక దేవుళ్లు ఆదరించే విధంగా ఉంటానని భావోద్వేగానికి గురైయ్యాడు.
నాగార్జున మాట్లాడుతూ.. '75 యేళ్ల క్రితం ఘంటశాల బలరామయ్యగారు మా నాన్న గారిని (అక్కినేని నాగేశ్వర రావు) పిలిచి చూసి.. కుర్రాడు బాగున్నాడే చలాకీగా అనుకుని యాక్టర్‌ని చేశారు. ఘంటశాల నాన్నగారికి అవకాశం ఇవ్వడంతోనే తామిక్కడ ఉన్నామని.. ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలి. కొత్తవారిని ప్రొత్సహించాలని నాన్నగారు చెప్పేవారు.. ఆయన స్పూర్తితోనే ముందుకెళ్తున్నామన్నారు.