Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీదేవిని పట్టించుకునేవారే లేరా? పొట్టి పొట్టి డ్రెస్సులేసినా ఫలితం లేదా.. మిస్టర్ ఇండియా2లో?

శ్రీదేవి ప్రస్తుతం కుర్ర వేషాలు వేస్తోందట. ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్తే.. ఆకట్టుకునే డ్రెస్సులు వేస్తుందట. కానీ ముఖంలో కళ తగ్గిపోవడంతో.. ఆమె వేసుకునే డ్రెస్‌లకు అందం తగ్గిపోతుందట. ఇటీవల ఓ ఈవెంట్‌కి నీలి

Advertiesment
Sridevi to act in Mr India 2?
, గురువారం, 22 సెప్టెంబరు 2016 (15:07 IST)
శ్రీదేవి ప్రస్తుతం కుర్ర వేషాలు వేస్తోందట. ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్తే.. ఆకట్టుకునే డ్రెస్సులు వేస్తుందట. కానీ ముఖంలో కళ తగ్గిపోవడంతో.. ఆమె వేసుకునే డ్రెస్‌లకు అందం తగ్గిపోతుందట. ఇటీవల ఓ ఈవెంట్‌కి నీలిరంగు పొడుగాటి గౌనులో ఈ భామ వచ్చింది. వయస్సును కనిపించనీయకుండా ఫిజిక్‌ను మెయిన్‌టెయిన్‌ చేసినా, ముఖంలో మునుపటి కళ తగ్గడంతో శ్రీదేవి వేస్తున్న డ్రస్సులు వెగటు పుట్టిస్తున్నాయట. 
 
ఇంగ్లిష్ వింగ్లిష్‌తో శ్రీదేవి రీ ఎంట్రీ ఇచ్చినా.. ఇంతవరకు అమ్మడు మరో సినిమాలో కనిపించలేదు. ఇందుకు కారణం శ్రీదేవి అమ్మ, అక్క, అత్త వేషాలు వేయననీ చెప్పడం.. కీలక రోల్‌ మాత్రమే చేస్తానని చెప్పడంతో శ్రీదేవికి అవకాశాలు సన్నగిల్లుతున్నాయట. ఇంకా రెమ్యునరేషన్‌ విషయంలో కూడా నిర్మాతలకు శ్రీదేవి చుక్కలు చూపించడంతో దక్షిణాదితో పాటు బాలీవుడ్ జనం ఏమాత్రం పట్టించుకోవట్లేదట.
 
అయితే శ్రీదేవి మిస్టర్ ఇండియాలో నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. 1987లో అనిల్ కపూర్ నటించిన ఈ సినిమాలో శ్రీదేవి కూడా రొమాంటిక్ రోల్ పోషించింది. ఈ సినిమాకు త్వరలో సీక్వెల్ రానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రంగం 'ఫేమ్' జీవా, కాజల్ అగర్వాల్ 'ఎంత వరకు ఈ ప్రేమ'