వరుణ్ ధావన్‌తో జతకట్టనున్న జాహ్నవి.. గెస్ట్ రోల్‌లో ఆ నలుగురు..?
టాలీవుడ్ అతిలోకసుందరిగా పేరు కొట్టేసిన శ్రీదేవి.. బాలీవుడ్‌కి వెళ్లి ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌ను పెళ్లాడి అక్కడే సెటిలైపోయింది. ఈమె ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌ను కూడా ఇంగ్లీష్ వింగ్లీష్‌తో ప్రారంభించ
టాలీవుడ్ అతిలోకసుందరిగా పేరు కొట్టేసిన శ్రీదేవి.. బాలీవుడ్‌కి వెళ్లి ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌ను పెళ్లాడి అక్కడే సెటిలైపోయింది. ఈమె ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌ను కూడా ఇంగ్లీష్ వింగ్లీష్‌తో ప్రారంభించేసింది. ఈ నేపథ్యంలో శ్రీదేవి పెద్ద కుమార్తె జాహ్నవి కూడా ప్రస్తుతం తెరంగేట్రం చేయనుందని వార్తలొస్తున్నాయి. బాలీవుడ్ ద్వారానే శ్రీదేవి కుమార్తె అరంగేట్రం ఉంటుందని టాక్.
బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ నేతృత్వంలో వరుణ్ ధావన్‌కు జంటగా.. జాహ్నవి సినిమా చేయనుందని సమాచారం. జాహ్నవి-వరుణ్ ధావన్ సినిమాలకు సంబంధించిన ప్రారంభకార్యక్రమాలు ముంబైలో రెండు క్రితమే జరిగిపోగా, కానీ దీనిపై శ్రీదేవి అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇకపోతే.. జాహ్నవి తొలి సినిమాలో ఫరా ఖాన్, నీతూ కపూర్, శ్రీదేవి, అనిల్ వంటి అగ్రతారలు గెస్ట్ రోల్స్ పోషిస్తారని బిటౌన్‌లో ప్రచారం సాగుతోంది.