Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీదేవి వర్ధంతి... 16 ఏళ్ల వయస్సులోనే...?

శ్రీదేవి వర్ధంతి... 16 ఏళ్ల వయస్సులోనే...?
, బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (21:13 IST)
అతిలోక సుందరి అనగానే గుర్తుకువచ్చే పేరు శ్రీదేవి. అందుకు తగ్గట్టుగానే అందం ఆమెది. తెలుగు, తమిళం, హిందీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు శ్రీదేవి. బాలనటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి అలనాటి సీనియర్ హీరోల సరసన హీరోయిన్‏గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీదేవి. అతిచిన్న వయసులోనే హీరోయిన్‏గా మారి తక్కువ సమయంలోనే అగ్రహీరోల సరసన ఎన్నో సినిమాల్లో నటించింది శ్రీదేవి. ఆమె వర్ధంతి ఫిబ్రవరి 24, 2022. 
 
బాలనటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది శ్రీదేవి. పదహారేళ్ల వయస్సులోనే అగ్రహీరోల సరసన నటించింది. అనురాగాలులో సెకండ్ హీరోయిన్‏గా నటించడమే కాకుండా.. ‘దేవుడులాంటి మనిషి’లో రాజబాబుకు జంటగా నటించింది. తమిళంలో ‘పదునారు వయదినిలై’లో నటించిన శ్రీదేవి మరోసారి ప్రేక్షకులను అలరించింది. ఆ సినిమాను కె.రాఘవేంద్రరావు తెలుగులో ‘పదహారేళ్ళ వయసు’ పేరుతో రీమేక్ చేశారు. అందులో కూడా శ్రీదేవినే హీరోయిన్‏గా చేసింది. అందులో శ్రీదేవి నటన ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది.
 
టాప్ హీరోయిన్‏గా శ్రీదేవి మారడానికి ఒకందుకు రాఘవేంద్రరావు గారు చూపించిన తీరు కూడా కావచ్చని చెప్పుకోవచ్చు. యన్టీఆర్‏తో రాఘవేంద్రరావు రూపొందించిన ‘వేటగాడు’లో శ్రీదేవిని హీరోయిన్‌గా తీసుకున్నారు. కాగా అంతకుముందే 1972లో ఎన్టీఆర్ ‘బడిపంతులు’లో ఆమె మనవరాలుగా నటించింది. మనవరాలుగా నటించి మళ్లీ అదే హీరోకు జోడిగా నటించిన హీరోయిన్ ఎవరయిన ఉన్నారంటే అది శ్రీదేవి మాత్రమే. 
 
ఎన్టీఆర్, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన వేటగాడు సినిమా సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాతో ఎన్టీఆర్, శ్రీదేవిల జంట ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ మూవీ అనంతరం ఎన్టీఆర్, శ్రీదేవి కాంబోలో వచ్చిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. దీంతో వరుసగా నాలుగు సంవత్సరాలు ఈ జంట నటించిన చిత్రాలు విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
 
బాలీవుడ్‏లో శ్రీదేవికి అంతగా అవకాశాలు రాలేదు. అప్పటివరకు హీరోయిన్ పాత్రలో మాత్రమే నటిస్తున్న శ్రీదేవిలోని సరికొత్త బయటకు తీశారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. విక్టరి వెంకటేష్ ప్రధాన పాత్రలో ఆర్జీవి తెరకెక్కించిన క్షణ క్షణం సినిమాలో శ్రీదేవి విభిన్నపాత్రలో నటించారు. 
 
ఈ చిత్రం ద్వారా శ్రీదేవికి ఉత్తమనటిగా నంది అవార్డు లభించింది. హీరోయిన్‏గా ఫుల్ జోరు మీదున్న సమయంలోనే శ్రీదేవి బాలీవుడ్ హీరో బోనీ కపూర్‏ను వివాహం చేసుకున్నారు. వివాహం అయిన తరువాత కొన్నాళ్ళు కెమెరాకు దూరంగా ఉన్న శ్రీదేవి మళ్లీ "ఇంగ్లిష్ వింగ్లిష్"తో రీఎంట్రీ ఇచ్చింది. 2013లో శ్రీదేవికి పద్మశ్రీ అవార్డు దక్కింది. ఆ తర్వాత శ్రీదేవి 2018, ఫిబ్రవరి 24న అనుమానాస్పద రీతిలో కన్నుమూసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాడుతుంటే నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి:మొగిలయ్య