మల్టిస్టారర్ కథతో శ్రీవిష్ణు చిత్రం
"అప్పట్లో ఓకడుండేవాడు"తో గత సంవత్సరానికి వీడ్కోలు పలికిన హీరో శ్రీవిష్ణు... ఓ స్టార్ హీరో, ఇంకో ఇద్దరు పాపులర్ హీరో, హీరోయిన్స్ కాంబినేషన్‌లో కాన్సెప్టెడ్ మల్టిస్టారర్ చిత్రం తీస్తున్నారు.
"అప్పట్లో ఓకడుండేవాడు"తో గత సంవత్సరానికి వీడ్కోలు పలికిన హీరో శ్రీవిష్ణు... ఓ స్టార్ హీరో, ఇంకో ఇద్దరు పాపులర్ హీరో, హీరోయిన్స్ కాంబినేషన్‌లో కాన్సెప్టెడ్ మల్టిస్టారర్ చిత్రం తీస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఇంద్రసేన దర్శకుడిగా పరిచయం కానున్నారు. బాబా క్రియోషన్స్ బ్యానర్‌పై డా.ఎం.వి.కె రెడ్డి సమర్పణలో అప్పారావు బెల్లాన
నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరిలో సెట్స్ మీదకి వెల్లనుంది.
దర్శకుడు ఇంద్రసేన మాట్లాడుతూ.."ఈ చిత్రం రెగ్యులర్ కమర్షయల్ చిత్రాల కంటే భిన్నంగా వుంటుంది. కొత్త కథ, కథనాలతో కంప్లీట్ వెస్ట్రన్ మూవీస్ బాటలో సాగుతుంది. ఈ చిత్రంలో సమాంతరంగా సాగే మూడు కథలుంటాయి. అందులో ఉండే మూడు మిస్టరీస్‌ని చేధించడం మీద ఈ కథ ఆధారపడి ఉంటుంది. ఇది రొలర్ కాస్టర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. మిగతా వివరాలు అతి త్వరలో మీకు తెలియజేస్తాం" అని అన్నారు.