Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీ మ‌హ‌విష్ణు మ‌హ‌త్యం క‌థ‌గా శ్రీ రంగ‌నాయక

Sri Ranganayaka
, గురువారం, 15 సెప్టెంబరు 2022 (16:22 IST)
Sri Ranganayaka
అన్న‌మ‌య్య , శ్రీరామ‌దాసు, మంజునాథ, శిరిడిసాయి , ఓం న‌మో వెంక‌టేశాయ‌.. వంటి అద్భుత భక్తిరస చిత్రాల సరసన మరో సినిమా తెలుగు వెండితెరపైకి రాబోతుంది. నేటి యువ‌త‌కు శ్రీ మ‌హ‌విష్ణు మ‌హ‌త్యం తెలియ‌జేసే ఉద్దేశ్యంతో గోవింద రాజ్ విష్ణు ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై రామావ‌త్ మంగ‌మ్మ నిర్మిస్తున్న‌ భ‌క్తిర‌స చిత్రం 'శ్రీ రంగ‌నాయక'. దుందిగ‌ల్ విన‌య్ రాజ్ మ‌హ‌విష్ణు పాత్ర‌లో టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ నంది వెంక‌ట్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. భ‌క్తుడి పాత్ర‌లో రంగాబాషా, లంకెల అశోక్ రెడ్డి ,పండ్రాల ల‌క్ష్మీ , ప‌ర‌వాడ స‌త్య‌మోహ‌న్, నిహారిక చౌద‌రి , త‌న్నీరు నాగేశ్వ‌ర‌రావు  ప్ర‌ధాన‌పాత్రల్లో న‌టిస్తున్నారు. 
 
డ్ర‌మ్స్ రాము సంగీతం అందించిన ఈమూవీ ఆడియో, ప్రీ రిలీజ్ పంక్ష‌న్ హైద్రాబాద్ ఏ.వి కాలేజ్‌లో ఘ‌నంగా జ‌రిగింది.  సెప్టెంబ‌ర్ 23 న  ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ ల‌లో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ మూవీ  పంక్ష‌న్ కి  ఏవి కాలేజ్ ప్రిన్సిప‌ల్ సిహెచ్ .రాజ‌లింగం, ప్ర‌ముఖ న‌టులు కుప్పిలి శ్రీనివాస్ , గ‌బ్బ‌ర్ సింగ్ సాయి , బుచ్చిరెడ్డి , వెంక‌న్న , బాస్క‌ర్ యాద‌వ్ , కరాటే గ్రాండ్ మాస్ట‌ర్ ఆర్.కె.క్రిషేనా , ఎస్ .శ్రీనివాస్ ,సౌమ్య ,రామ‌చంద్ర శ్రీనివాస్ కుమార్ పలువురు ప్ర‌ముఖులు పాల్గోని  తెలుగు వెండితెరపై శ్రీరంగ‌నాయ‌క భక్తిరస చిత్రం అద్భుత విజయం సాదిస్తుంద‌ని అన్నారు.. 
 
అనంత‌రం శ్రీ మ‌హ‌విష్ణు పాత్ర‌దారి దుందిగ‌ల్ విన‌య్ రాజ్ మాట్లాడుతూ, శ్రీమ‌హావిష్ణు పాత్ర‌లో న‌టించ‌డం పూర్వజ‌న్మ సుకృతం అన్నారు. ద‌ర్శ‌కులు నంది వెంక‌ట రెడ్డి  అద్భుతంగా చిత్రీక‌రించార‌ని తెలిపారు. సెప్టెంబ‌ర్ 23 న  థియేట‌ర్ ల‌లో రిలీజ్ అవుతున్న ఈ మూవీకి ఘ‌నవిజ‌యం అందించాల‌ని కోరారు.
 
భ‌క్తుడి పాత్ర‌ధారి  రంగాబాషా మాట్లాడుతూ :  శ్రీ రంగ‌నాయ‌క చిత్రంలో భ‌క్తుడి పాత్ర‌లో న‌టించాన‌ని, ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ద‌న్య‌వాదాలు తెలిపారు..ఈ నెల 23 విడుద‌ల అవుతున్న మా మూవీ ని ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు
 
న‌టుడు లంకెల అశోక్ రెడ్డి మాట్లాడుతూ : శ్రీ రంగ‌నాయ‌క చిత్ర ద‌ర్శ‌కులు వెంక‌ట్  రెడ్డి  గారు.. దుందిగ‌ల్ విన‌య్ రాజ్ గారి ని వెండితెర‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు.. బిగ్ స్ర్కీన్ పై విన‌య్ రాజ్ గారిని చూస్తుంటే సాక్షాత్తూ శ్రీ మ‌హావిష్ణు దిగివ‌చ్చిన‌ట్టు ఉంద‌న్నారు.. ఎన్నో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కు ఓర్చి రూపోందించిన ఈసినిమాను ప్రేక్ష‌కులు దిగ్విజ‌యం అందించాల‌ని కొరారు..
 
అతిథి న‌టులు కుప్పిలి శ్రీనివాసరావు, గ‌బ్బ‌ర్ సింగ్ సాయి,  ఏవి కాలేజ్ ప్రిన్సిప‌ల్ సిహెచ్ .రాజ‌లింగం.. చిత్ర‌యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కారు దొంగలున్నారు జాగ్రత్త - ట్విస్ట్ ఏమంటే...