Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విలక్షణ చిత్రాల దర్శకుడు శ్రీకిషోర్ కొత్త చిత్రం 'దేవిశ్రీప్రసాద్'

విలక్షణ చిత్రాల దర్శకుడు శ్రీకిషోర్ కొత్త చిత్రం 'దేవిశ్రీప్రసాద్'
, శుక్రవారం, 8 జులై 2016 (17:00 IST)
'స‌శేషం', 'భూ' చిత్రాల‌తో తెలుగు సినీ అభిమానులు, ప్రేక్ష‌కుల సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు శ్రీ కిషోర్ హ్యాట్రిక్ చిత్రం 'దేవిశ్రీప్రసాద్'ను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో, ప్రేక్షకులు ఊహించని ట్విస్టులతో కూడిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఈ సినిమాను స‌రికొత్త రీతిలో తెర‌కెక్కించేలా శ్రీకిషోర్ స‌న్నాహాలు చేస్తున్నారు.
 
ఈ చిత్రంలో ఓ క‌మెడియ‌న్‌తో పాటు ఇద్ద‌రు ప్ర‌ముఖ హీరోలు, ఓ ప్ర‌ముఖ హీరోయిన్ న‌టిస్తుండ‌టం విశేషం. సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. 'దేవిశ్రీప్రసాద్' అనే టైటిల్ ప్రేక్షకుల్లో ఓ ఆసక్తిని రేకెత్తిస్తుందనడంలో సందేహం లేదు. 
 
ఇలా టైటిల్‌తో పాటు పోస్టర్ డిజైనింగ్ నుంచి ప్ర‌తి విష‌యంలో ద‌ర్శ‌కుడు శ్రీ కిషోర్ కొత్త పంథాలో యోచిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన న‌టీన‌టులు, టెక్నిక‌ల్ టీం వివ‌రాల‌ను తెలియ‌జేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శేఖర్‌ కమ్ముల ప్రీ ప్రొడక్షన్ వర్క్‌షాప్‌ స్టార్ట్ .. హాజరైన వరుణ్‌తేజ్ - సాయిపల్లవి