Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహేష్ బాబు "స్పైడర్" కథ ఏంటంటే...

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం "స్పైడర్". ఈ చిత్రం ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. తమిళ దర్శక హీరో ఎస్.జే.

Advertiesment
మహేష్ బాబు
, బుధవారం, 20 సెప్టెంబరు 2017 (09:21 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం "స్పైడర్". ఈ చిత్రం ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. తమిళ దర్శక హీరో ఎస్.జే. సూర్య ప్రధాన విలన్ పాత్రను పోషించాడు. 
 
అయితే, స్పైడర్‌ చిత్రంలో హీరో ఇంటెలిజెన్స్ బ్యూరోలో గూఢచారిగా పనిచేస్తుంటాడు. అతనికి సామాజిక బాధ్యత ఎక్కువ. తనకున్న అధికారంతో సమాజానికి మేలు చేయాలని నిరంతరం పరితపిస్తుంటాడు. 
 
ఈ క్రమంలో ఓ సంఘవిద్రోహకశక్తితో అతను తలపడాల్సివస్తుంది. అత్యంతప్రమాదకారియైన ఆ వ్యక్తిపై శివ సాగించిన పోరాటమేమిటన్నదే స్పైడర్ కథాంశమని దర్శకుడు వెల్లడించాడు. తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 27న విడుదలకానుంది. 
 
ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్రసాద్ నిర్మించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై నిర్మాత మాట్లాడుతూ, సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు.ఏ.సర్టిఫికెట్ లభించింది. ఇటీవల విడుదలైన ఆడియో, ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించినట్టు చెప్పారు. 
 
కాగా, ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్, ఎడిటింగ్: శ్రీకరప్రసాద్, సంగీతం: హేరిస్ జయరాజ్, ఫైట్స్: పీటర్‌హెయిన్స్, సమర్పణ: ఠాగూర్ మధు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్.మురుగదాస్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరో ప్రభాస్ హీరోయిన్‌పై క్రిమినల్ కేసు...