"మెట్రో" మూవీ సాంగ్‌లో నటించిన గీతామాధురి
టాలీవుడ్ క్రేజీ సింగర్ గీతామాధురి త్వరలో వెండితెర ఆరంగేట్రం చేస్తోందంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ యంగ్ అండ్ డైనమిక్ సింగర్ నటించే ఆ సినిమా ఏది? అన్న ఆసక్తి కనబరిచారంతా. ఏదైతేనేం గీత
టాలీవుడ్ క్రేజీ సింగర్ గీతామాధురి త్వరలో వెండితెర ఆరంగేట్రం చేస్తోందంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ యంగ్ అండ్ డైనమిక్ సింగర్ నటించే ఆ సినిమా ఏది? అన్న ఆసక్తి కనబరిచారంతా. ఏదైతేనేం గీతామాధురి నటించిన సినిమా డీటెయిల్స్ వచ్చేశాయి. డైనమిక్ సింగర్ స్టైల్‌ని ఎలివేట్ చేస్తూ కొన్ని స్టిల్స్ రిలీజ్ అయ్యాయి.
గీతామాధురి ఎంట్రీ ఇస్తున్న ఆ ఇంట్రెస్టింగ్ సినిమా 'మెట్రో'. ఇటీవలే స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఫెంటాస్టిక్ నేరేషన్‌తో తెరకెక్కిన చిత్రంగా ఈ సినిమాపై ప్రశంసల జల్లులు కురిపించారు. చైన్ స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఆద్యంతం రక్తికట్టించే ఈ చిత్రం తెలుగులోనూ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని ఆయన అన్నారు. అలాంటి క్రేజీ మూవీ 'మెట్రో'లో ఓ సాంగ్‌లో గీతామాధురి తనని తాను ఆవిష్కరించుకున్నారు. ఎంతో శ్రావ్యంగా సాగే ఈ మెలోడీ పాటను తాను స్వయంగా ఆలపించడమే గాకుండా తనదైన శైలిలో అభినయించారు.
ఈ సందర్భంగా నిర్మాత రజనీ తాళ్లూరి మాట్లాడుతూ.. 'అతి త్వరలోనే 'మెట్రో' తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గీతామాధురి ఆలపించిన ఆ మెలోడీ సాంగ్ సినిమాకి పెద్ద అస్సెట్. ఈ ట్యాలెంటెడ్ సింగర్ స్వయంగా పాడటమే గాకుండా అభినయించారు. ఈ సినిమాలో అన్ని పాటలు సందర్భానుసారం వస్తూ వేటికవే ప్రత్యేకంగా అలరిస్తాయి. ఈ రోజు గీతా మాధురికి సంబంధించిన స్టిల్స్‌ను రిలీజ్ చేస్తున్నాం' అన్నారు.
సమర్పకుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ... 'వర్ధమాన గాయని గీతామాధురి ఆలపించి నటించిన ఈ గీతం సినిమాలో వెరీ స్పెషల్. మేకింగ్ పరంగా విజువలైజేషన్ పరంగా వండర్‌ఫుల్‌గా ఉంటుంది. క్రియేటివ్ మేకింగ్ కనిపిస్తుంది. ఈ సీజన్‌లో పెద్ద హిట్టయ్యే చిత్రమిది. ఇటీవలే డబ్బింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం ఫైనల్ మిక్సింగ్ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే సినిమా రిలీజ్ చేస్తున్నాం' అని తెలిపారు.