రూమర్స్‌కు ఓ నమస్కారం.. సెల్ఫీ దిగి పోస్ట్ చేసిన సమంత.. చెప్పేందుకు ఏదోకటి ఉండాలిగా డార్లింగ్!!
అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్యను పెళ్లాడనుందని మీడియాలో వస్తున్న వార్తలపై సమంత ట్విట్టర్లో స్పందించింది. చైతూతో పెళ్లిపై ట్విట్టర్లో సమంతను అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ట్విట్టర్ వేదికగా, త
అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్యను పెళ్లాడనుందని మీడియాలో వస్తున్న వార్తలపై సమంత ట్విట్టర్లో స్పందించింది. చైతూతో పెళ్లిపై ట్విట్టర్లో సమంతను అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ట్విట్టర్ వేదికగా, తన వివాహంపై వస్తున్న వార్తల నుంచి హనీమూన్ వరకూ పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. వీటిల్లో కొన్ని చిలిపి, మరికొన్ని సెన్సేషనల్ జవాబులిచ్చింది.
చిలిపి ప్రశ్నలు వేస్తున్న అభిమానులను డార్లింగ్ అని సంబోధిస్తూ, సమంత పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. సెప్టెంబర్ 23న మీ వివాహం కుదిరిందటగా? అన్న ప్రశ్నకు ఆ విషయం ఎవరూ చెప్పలేదుగా అని అంది. కొన్ని వెబ్ సైట్లలో హనీమూన్ తేదీలు, ఎక్కడికి వెళ్లనున్నారన్న విషయాలపై రూమర్స్ వస్తున్నాయని చెప్పగా, ఓ నమస్కారం పెడుతూ సెల్ఫీ దిగి పోస్ట్ చేసింది.
పెళ్లి ఎవరెవరికి జరుగుతుందో చూడాలని ఉందని ఓ అభిమాని చెప్పగా, తన కోరిక కూడా అదేనని అంది. మీ పెళ్లికి పార్క్ హయత్ హోటల్‌ను ఎంచుకున్నారటగా? అన్న ప్రశ్నకు... ఆ హోటలా? వావ్... దీనిపై అందరూ చర్చించండి అని చమత్కరించింది. మరో అభిమాని, ఈ సోది అంతా ఎందుకు డార్లింగ్... ఏదో ఒకటి చెప్పేస్తే అయిపోతుందిగా అంటే, అసలు ఏదో ఒకటి ఉండాలిగా డార్లింగ్ అని తనదైన శైలిలో చెప్పుకుంది.