Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెండో పెళ్లికి రెడీ అవుతున్న రజనీ కుమార్తె సౌందర్య.. వరుడు ఎవరో తెలుసా?

Advertiesment
రెండో పెళ్లికి రెడీ అవుతున్న రజనీ కుమార్తె సౌందర్య.. వరుడు ఎవరో తెలుసా?
, బుధవారం, 14 నవంబరు 2018 (13:27 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కుమార్తె, దర్శకురాలు, నిర్మాత అయిన సౌందర్య రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి చిన్నకుమార్తె శ్రీజ తరహాలోనే సౌందర్య కూడా రెండో పెళ్లి చేసుకోనుంది. ఇప్పటికే సౌందర్య నిశ్చితార్థం జరిగిపోయిందని టాక్. రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్యకు, ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమారుడితో ఆమె వివాహం జరుగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
కాగా 2010లో అశ్విన్ అనే బిజినెస్‌మేన్‌తో సౌందర్య వివాహం జరిగింది. వీరికి వేద కృష్ణ (5) అనే కుమారుడు వున్నాడు. కానీ అశ్విన్‌తో ఏర్పడిన మనస్పర్థల కారణంగా సౌందర్య అతనికి దూరమైంది. రెండేళ్ల క్రితం సౌందర్య తన కుమారుడితో పాటు అమ్మగారింట్లోనే వుంటోంది. 
 
ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త వనంగాముడి కుమారుడు విశ్వగణ్‌‌తో సౌందర్యకు రెండో వివాహం నిశ్చయమైంది. మాజీ డీఎంకే ఎమ్మెల్యే పొన్‌ముడి సోదరుడే పారిశ్రామికవేత్త వనగాముడి. ఈయన కుమారుడైన విశ్వగణ్  ఇటీవల విడుదలైన వంజగర్ వులగం అనే సినిమాలో కీలక పాత్రలో కనిపించాడు. ఇతను అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసాడు. ఇంకా ఓ నిర్మాణ సంస్థను కూడా నడుపుతున్నాడు.  
 
నటుడు, వ్యాపారవేత్త అయిన విశ్వగణ్ వనంగామూడితో జనవరిలో మూడు ముళ్లు వేయించుకోబోతున్నట్టు కోలీవుడ్ సమాచారం. విశ్వగణ్‌కు కూడా ఇది రెండో వివాహమే కావడం గమనార్హం. ఇక గ్రాఫిక్ డిజైనర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన సౌందర్య దర్శకురాలిగా తండ్రి రజనీకాంత్-దీపిక పదుకునే పాత్రలతో దేశంలోనే తొలి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ''కొచాడియాన్'' అనే సినిమాను తీశారు. నిర్మాతగా ‘గోవా’ అనే సినిమాను నిర్మించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లు అర్జున్ అంటే క్రష్.. పవన్‌తో ఆ ఛాన్స్ వస్తే.. ప్రియాంక జవల్కర్(Video)