Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేటుగాళ్లకు సోనూసూద్ వార్నింగ్.. ఏం జరిగందేమిటంటే..?

కేటుగాళ్లకు సోనూసూద్ వార్నింగ్.. ఏం జరిగందేమిటంటే..?
, సోమవారం, 8 మార్చి 2021 (12:47 IST)
కేటుగాళ్లకు సోనూసూద్ వార్నింగ్ ఇచ్చాడు. తన పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న వారికి రియల్ హీరో సోనూ సూద్ హెచ్చరించాడు. గత కొన్ని రోజులుగా కొంత మంది సోనూ సూద్ లెటర్ హెడ్‌తో రుణాలు ఇస్తామంటూ అమాయకులను నమ్మించి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. అంతేకాదు తన పేరున ఉన్న సోనూసూద్ ఫౌండేషన్ పేరు మీద అక్రమంగా డబ్బులు దండుకుంటున్న మోసగాళ్లుకు ఈ రియల్ హీరో సోషల్ మీడియా వేదికగా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. 
 
తన పేరు మీద ఓ లెటర్ హెడ్ తయారు చేసి దాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసారు. ఇందులో భాగంగా తన పేరున ఉన్న లెటర్ హెడ్ ద్వారా 60 నెలల ఈఎంఐ చొప్పన రూ.5లక్షల లోన్ తీసుకునే విధంగా సోనూ సూద్ సౌకర్యం కల్పిస్తుందని కొంత మంది అమాయకుల నుంచి కేటుగాళ్లు అక్రమంగా డబ్బు దోచుకుంటున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. 
 
ఇటువంటి ఋణాలు ఇస్తున్నట్టు నేను ఎక్కడ పేర్కొనలేదని సోనూసూద్ పేర్కొన్నాడు. అంతేకాదు డబ్బుల కోసం కేటుగాళ్లు క్రియేట్ చేసిన ఫేక్ లెటర్ హెడ్‌ను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసాడు. ఇటువంటి మాయగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోనూ సూద్ పేర్కొన్నాడు. తన పేరిట అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ముంబాయితో పాటు యూపీ పోలీసులకు సోనూ సూద్ ఫిర్యాదు చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇల్లందులో ఆచార్య.. మెగాస్టార్ వెంట చెర్రీ.. ఫోటోలు వైరల్