Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్‌పై దాడి.. ఆస్పత్రిలో అడ్మిట్

Advertiesment
sonu nigam
, మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (11:36 IST)
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో బాలీవుడ్ నటుడు సోనూ నిగమ్‌‍పై దాడి జరిగింది. చెంబూర్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ కార్యక్రమంలో సోనూ నిగిమ్ వేదికపై నుంచి కిందికి దిగి వస్తుండగా ఎమ్మెల్యే ప్రకాష్ ఫటేర్ పెకర్ కుమారుడు స్వప్నిల్ ఎదురుగా వెళ్లడంతో ఈ గందరగోళం నెలకొంది. 
 
తనను అడ్డుకోవడంతో సోనూ నిగమ్ సహాయకుడు రబ్బానీని స్వప్నిల్‌ను పక్కకు తోసేశాడు. దీంతో అతను గాయాలయ్యాయి. అలాగే, మిగిలినవారిని కూడా పక్కకు తోసేస్తూ సోనూ నిగమ్ వద్దకు కూడా వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ గందరగోళం వెనుక నుంచి తనను ఎవరో తోసేశారని, దీంతో తాను కూడా కిందపడినట్టు ఆయన మీడియాకు వెల్లడించారు. 
 
తన రక్షణ సిబ్బందికి గాయాలు అయ్యాయని ఆయన తెలిపారు. ఈ దాడి ఘటనపై సోనూ నిగమ్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాష్ ఫటేల్ పెకర్ కుమారుడు స్వప్నిల్‌ ఈ గందరగోళానికి కారణమని తేలింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెడ్ కార్పెట్‌పై మెరిసిన అలియా భట్, నటి రేఖ