బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్ టైటిల్ రోల్ లో శ్రీ కోనేటి దర్శకత్వంలో గ్లోబల్ ఫిలిమ్స్ & కథ వేరుంటాది బ్యానర్స్ పై ఎం.డీ పాషా నిర్మిస్తున్న చిత్రం బూట్ కట్ బాలరాజు. మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో అందించిన ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమా పై క్యురియాసిటీ పెంచింది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి చిన్ని చిన్ని అనే పాట ని విడుదల చేశారు. హీరో హీరోయిన్ చైల్డ్ వుడ్ స్వీట్ మెమరిస్ ని గుర్తు చేస్తూ సాగిన పాటని లవ్లీ మెలోడీగా స్వరపరిచారు. సాయి వేద వాగ్దేవి తన మెస్మరైజ్ వాయిస్ అందంగా అలపించిన ఈ పాటకు రంజిత్ కుమార్ రికీ రాసిన సాహితం మరింత ఆకర్షణ తీసుకొచ్చింది.
బ్లాక్ బస్టర్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా శ్యామ్ కె నాయుడు డీవోపీ పని చేస్తున్నారు. ఈ చిత్రానికి విజయ్ వర్ధన్ ఎడిటర్, విఠల్ కొసనం ఆర్ట్ డైరెక్టర్.
బూట్ కట్ బాలరాజు ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.