Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భయంకర వ్యాధికి గురయ్యా.. సంపూర్ణారోగ్యంతో తిరిగివచ్చా: స్నేహా ఉల్లాల్

తెలుగులో తొలి సినిమా ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాలో గ్లామర్‌ను అద్భుతంగా పండించిన స్నేహ ఉల్లాల్ తర్వాత టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. కానీ గత మూడేళ్లుగా ఆమె ఏ చిత్రరంగంలోనూ కనిపించకపోవడంతో ఆమె చిత్ర సీమనుంచి తప్పుకున్నట్లే అనుకున్నారు. కానీ భయ

Advertiesment
Sneha Ullal
హైదరాబాద్ , శనివారం, 3 జూన్ 2017 (06:55 IST)
తెలుగులో తొలి సినిమా ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాలో గ్లామర్‌ను అద్భుతంగా పండించిన స్నేహ ఉల్లాల్ తర్వాత టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. కానీ గత మూడేళ్లుగా ఆమె ఏ చిత్రరంగంలోనూ కనిపించకపోవడంతో ఆమె చిత్ర సీమనుంచి తప్పుకున్నట్లే అనుకున్నారు. కానీ భయంకరమైన వ్యాధి బారినపడి మూడేళ్ల విశ్రాంతి తర్వాత సంపూర్ణారోగ్యంతో వచ్చానని నాది ఆరోగ్యపరమైన బ్రేకే తప్ప కమ్ బ్యాక్ కాదని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది ఉల్లాల్.
 
తాను అనారోగ్యం బారిన పడ్డానని స్వయంగా స్నేహా ఉల్లాలే చెప్పారు. ‘‘ఒంట్లో బాగా లేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లి, చెక్‌ చేయించుకున్నా. టెస్టులన్నీ చేశాక నేను ‘ఆటోఇమ్యూన్‌ డిజార్డర్‌’తో బాధపడుతున్నానని డాక్టర్లు చెప్పారు. నా రోగ నిరోధక శక్తే నాకు ప్రతికూలంగా మారేలా చేసే రుగ్మత అన్నమాట. ఇది రక్తానికి సంబంధించిన జబ్బు’’ అని స్నేహా ఉల్లాల్‌ అన్నారు. 
 
‘‘ఈ రుగ్మత వల్ల నేను బలహీనమైపోయా. కంటిన్యూస్‌గా అరగంట నిలబడలేని పరిస్థితి. అయినా సినిమాలు చేశా. దాంతో ఇంకా వీక్‌ అయిపోయాను. ఒకానొక దశలో పరిగెత్తడం, డ్యాన్స్‌ చేయడం... ఇవన్నీ చేయలేకపోయా. దాంతో బ్రేక్‌ తీసుకుని, మందులు వాడుతూ, తగినంత విశ్రాంతి తీసుకున్నా. ఫైనల్‌గా నా ఆరోగ్య సమస్య సాల్వ్‌ అయింది. ఇక సినిమాలు చేయాలనుకుంటున్నా. అయితే ‘కమ్‌బ్యాక్‌’ అంటే ఇష్టపడను. ఎందుకంటే, కావాలని సినిమాలను వదిలేసి, మళ్లీ వస్తే అది ‘కమ్‌బ్యాక్‌’ అవుతుంది. నేను జస్ట్‌ బ్రేక్‌ తీసుకున్నా’’ అన్నారు.
 
మూడేళ్లు చిత్రసీమకు దూరం అయినప్పటికీ చెరగని ఆత్మవిశ్వాసంతో మళ్లీ వస్తున్న స్నేహ ఉల్లాల్‌కు చిత్రసీమ స్వాగతం చెబుతుందనే ఆశిద్దాం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంచి మిత్రులం.. మాకు లేని బాధ మీకెందుకు.. అనేసిన అనుష్క