Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్‌పై శివబాలాజీ ఫైర్.. మాకు గతిలేక ఇక్కడికి వచ్చామనుకుంటున్నారా? స్టుపిడ్ నిర్ణయం..

తెలుగు బిగ్ బాస్ షోపై కాటమరాయుడు నటుడు శివబాలాజీ ఫైర్ అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో రూల్స్ ప్రకారం స్మోక్ రూమ్‌లోకి ఒకసారి ఒకరు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. తొలిరోజే ఒకేసా

Advertiesment
Siva balaji
, శనివారం, 22 జులై 2017 (11:27 IST)
తెలుగు బిగ్ బాస్ షోపై కాటమరాయుడు నటుడు శివబాలాజీ ఫైర్ అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో రూల్స్ ప్రకారం స్మోక్ రూమ్‌లోకి ఒకసారి ఒకరు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. తొలిరోజే ఒకేసారి ఐదుగురు స్మోక్ రూమ్‌లో ఉండటంతో బిగ్‌బాస్‌ వారిని హెచ్చరించారు. ప్రతిరోజూ ఈ రూల్స్ బ్రేక్ చేయడంతో బిగ్‌బాస్ వారికి శిక్ష ఇవ్వాలనుకున్నారు.
 
రోజువారీగా ఇచ్చే సిగరెట్లను ఇవ్వడం తాత్కాలికంగా ఆపివేస్తున్నామని, తదుపరి నిర్ణయం వెల్లడయ్యేవరకు ఈ శిక్ష తప్పదని ఆదేశాలు రావడంతో స్మోకింగ్ అలవాటున్న కొందరు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇందులో శివబాలాజీ కూడా ఒకరు. తమకు ఏం గతిలేక ఇక్కడికి వచ్చామనుకుంటున్నారా..? అసలు బిగ్ బాస్ ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. 
 
ఈ షోలో పాల్గొన్న ఇతర సభ్యులు ధన్‌రాజ్, సమీర్‌లు శివబాలాజీకి మద్ధతు తెలిపారు. బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లు ఎలా ఉన్నా వందశాతం మనసుపెట్టి చేస్తున్నామన్నారు. కొన్ని పన్మిష్మెంట్లను కూడా స్వీకరిస్తున్నామని.. అందరూ ఇక్కడ సెలబ్రిటీలే కావడంతో ఎలా నడుచుకోవాలో తెలుసునని చెప్పారు. అయితే బిగ్‌బాస్ ఇంత స్టుపిడ్ నిర్ణయం తీసుకుంటారనుకోలేదని అభిప్రాయపడ్డారు. 
 
శివబాలాజీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని బిగ్‌బాస్ సిగరెట్లు అందించినా.. ఒక్కరు స్మోక్ చేస్తున్నప్పుడు ఇతర 13 మంది సభ్యులు బాత్రూమ్‌లో ఉండాలని కండీషన్ పెట్టారు. కొందరు సభ్యులు ఒక్కొక్కరుగా స్మోక్ రూమ్‌కు వెళ్లి వచ్చిన తర్వాత బిగ్‌బాస్‌కు క్షమాపణ చెప్పారు. ఒక్క వ్యక్తి స్మోక్ చేస్తుంటే మిగిలిన 13 మంది బాత్రూమ్‌లో ఉండాలన్న కండీషన్‌ను రద్దు చేయాలని, మరోసారి స్మోక్ జోన్ రూల్ బ్రేక్ చేయకుండా జాగ్రత్తగా ఉంటామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ : ఓవియాకు నెటిజన్ల సపోర్ట్.. 'సేవ్ ఓవియా' హ్యాష్ ట్యాగ్‌కు అగ్రస్థానం..