సునీత ''రాగం'' అదిరింది.. షార్ట్ ఫిలిమ్ వీడియోకి 6 లక్షల వ్యూస్.. (Video)
గాయని సునీత తాజాగా ''రాగం'' అనే షార్ట్ ఫిలిమ్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా భర్తకు దూరంగా ఉంటూ రాణించలేకపోయినా.. అందం.. గాత్రంతో ప్రేక్షకులను మదిని కట్టిపడేసిన సునీత రాగంలో అద్భుతమైన నటన
గాయని సునీత తాజాగా ''రాగం'' అనే షార్ట్ ఫిలిమ్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా భర్తకు దూరంగా ఉంటూ రాణించలేకపోయినా.. అందం.. గాత్రంతో ప్రేక్షకులను మదిని కట్టిపడేసిన సునీత రాగంలో అద్భుతమైన నటనను కనబరిచింది. ఈ చిత్రాన్ని యూ ట్యూబ్‌లో అక్టోబర్ 7న విడుదల చేశారు.. హృదయాన్ని టచ్ చేసే ఓ సింపుల్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది.
ఒంటరి మహిళ అనగానే సమాజం ఎలా చూస్తుంది. పెళ్లయి భర్తకు దూరంగా ఉండే మహిళ విషయంలో చుట్టూ ఉన్నవాళ్లు ఎలా అపార్థం చేసుకుంటారు? అన్న ఓ రియలిస్టిక్ పాయింట్‌తో ఈ లఘు చిత్రాన్ని ఎంతో హుందాగా ఆవిష్కరించారు. ఈ సినిమాకు తన వ్యక్తిగత జీవితానికి సంబంధమున్నట్లు గతంలో సునీత వెల్లడించింది. అందుకే షార్ట్ ఫిలిమ్‌లో నటించానని చెప్పుకొచ్చింది.
ఈ సినిమాలో సునీత నటన, ఆహార్యం, సహజసిద్ధమైన నటన అందిరిని ఆకర్షించేలా చేసింది. ఇప్పటి వరకు ఈ షార్ట్ ఫిలిం వీడియోకి 6 లక్షల వ్యూస్ లభించగా ఇందులో సునీత నటనతో పాటు .. దర్శకుడు శ్రీ చైతు కథా కథనాలకు నెటిజన్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మీరూ ఈ షార్ట్ ఫిలిమ్‌ను చూడండి.. సునీత నటన ఎలా ఉందో కామెంట్ చేయండి.