Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిరాడంబరంగా జనవరిలో గాయని సునీత పెళ్లి

Advertiesment
నిరాడంబరంగా జనవరిలో గాయని సునీత పెళ్లి
, మంగళవారం, 8 డిశెంబరు 2020 (20:52 IST)
గాయని సునీత త్వరలో కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు. ఈ క్రమంలో మ్యాంగో మీడియా గ్రూప్‌ హెడ్‌ రామ్‌ వీరపనేనినితో సోమవారం నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక జనవరిలో తమ పెండ్లీ జరగనున్నట్లు సునీత వెల్లడించారు. ఈ వేడుక కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 
 
కాగా సునీత, రామ్‌ ఇద్దరికి ఇదీ రెండో వివాహమన్న సంగతి తెలిసిందే. కాగా గత కొంత కాలంగా సునీత రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం కొనసాగింది. ఈ నేపథ్యంలో వివాహబంధంలోకి అడుగుపెడుతున్నట్టు సోమవారం సునీత స్వయంగా ప్రకటించారు. 
 
సునీతకు 19 ఏళ్ల వయస్సులోనే వివాహం జరిగింది. చిన్నవయసులోనే ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత భర్తతో మనస్పర్థాలు తల్తెడంతో ఆయనతో సునీత విడాకులు తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిసెంబర్ 18న థియేటర్స్‌లో ఆర్జీవి కుటుంబ కథా చిత్రం మర్డర్