తమిళ్ స్టార్ హీరో శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . వల్లభ , మన్మథ లాంటి సినిమాలతో తెలుగులో కూడా ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకుని తనకంటూ కొంతమంది అభిమానులను సాధించుకున్నాడు. యూత్ ఫుల్ కాన్సప్ట్ సినిమాలు చేస్తూ యూత్ కి మరింత దగ్గరయ్యాడు శింబు. కేవలం నటుడిగానే కాకుండా శింబు లో మంచి సింగర్ కూడా ఉన్నాడు. శింబుకు పాటలు పాడటం కొత్తేం కాదు.. టాలీవుడ్ లో ఎన్టీఆర్ తో పాటు మరికొంత మంది హీరోల సినిమాలకు శింబు పాటలు పాడి మెప్పించాడు. ఇప్పుడు మరో యంగ్ హీరో కోసం పాట పాడనున్నాడు శింబు.
కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్ ప్రస్తుతం చేస్తున్న "18పేజిస్" ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు "కుమారి 21ఎఫ్" చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ చిత్రం నుండి "నన్నయ్య రాసిన" అనే పాటను విడుదల చేసారు. ఆ మెలోడీ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇలా ఒక్కో అప్డేట్ తో అంచనాలు పెరగడం వలన ఈ సినిమా విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు చిత్రబృందం అందులో భాగంగానే తమిళ్ స్టార్ హీరో శింబు తో ఈ చిత్రంలో పాట పాడించనున్నారు.
ఇదివరకే ఎన్టీఆర్ బాద్ షా కి "డైమెండ్ గర్ల్" మంచు మనోజ్ పోటుగాడికి కి "బుజ్జి పిల్ల" యంగ్ హీరో రామ్ పోతినేని వారియర్ కి "బుల్లెట్ సాంగ్" ను పడిన శింబు ఇప్పుడు నిఖిల్ నటిస్తున్న 18పేజిస్ కోసం "టైం ఇవ్వు పిల్ల టైం ఇవ్వు" అనే పాటను పాడనున్నాడు. మంచి అంచనాలను నెలకొల్పిన ఈ చిత్రాన్ని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 23 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే అధికారిక ప్రకటన చేసారు.