Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వామ్మో... నాగుపాము చేత్తో పట్టుకుని హీరో శింబు, కొత్త చిత్రం "ఈశ్వరుడు"

వామ్మో... నాగుపాము చేత్తో పట్టుకుని హీరో శింబు, కొత్త చిత్రం
, మంగళవారం, 27 అక్టోబరు 2020 (20:42 IST)
నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్రామీణ నేపథ్య చిత్రం "ఈశ్వరుడు". మాధవ్ మీడియా బాలాజీ సమర్పణలో డీ కంపెనీ - కేవీ దురై బ్యానర్ పైన బాలాజీ కపా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్లో శింబు తన స్టైల్లో లుంగీ కట్టుకొని పడగవిప్పిన పాముని మెడ మీద వేసుకొని కనిపిస్తున్నాడు.
 
శింబు లుక్ చూస్తుంటే గతంలో కంటే చాలా బరువు తగ్గినట్లు కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో శింబు సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ సంగీతం సమకూర్చనున్నాడు. ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్