Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్వేత.. నన్ను బజారుకీడుస్తోంది.. ఆమెతో కలిసి జీవించలేను : పుల్కిత్ సామ్రాట్

బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన మరో హీరో తన భార్య నుంచి విడాకులు కోరుకుంటున్నాడు. తన భార్యతో వేగడం కష్టమని ఇకపై ఆమెతో కలిసివుండలేనని తెగేసి చెప్పాడు. ఆ హీరో ఎవరో కాదు పుల్కిత్ సామ్రాట్. ఈ కుర్ర హీరో నట

Advertiesment
Shweta Rohira
, గురువారం, 14 జులై 2016 (12:38 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన మరో హీరో తన భార్య నుంచి విడాకులు కోరుకుంటున్నాడు. తన భార్యతో వేగడం కష్టమని ఇకపై ఆమెతో కలిసివుండలేనని తెగేసి చెప్పాడు. ఆ హీరో ఎవరో కాదు పుల్కిత్ సామ్రాట్. ఈ కుర్ర హీరో నటి యామి గౌతమ్‌తో ప్రేమలో పడి భార్యను అశ్రద్ధ చేస్తున్నసంగతి తెలిసిందే. తొలుత ఈ వార్తలను పుల్కిత్ ఖండించినప్పటికీ.. యామి మాత్రం పెదవి విప్పలేదు. అయితే, తాజాగా పుల్కిత్ చేసిన వ్యాఖ్యలు యామితో కలిసివుండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
తన భార్యకు గర్భస్రావం అయినప్పటి నుంచే శ్వేతకు అతడు దూరమవుతూ వచ్చాడని బాలీవుడ్ వర్గాలు కోడై కూశాయి. అయితే ఈ ఆరోపణలను అతడు తోసిపుచ్చాడు. నిజానికి శ్వేతకు గర్భస్రావం జరిగి నాలుగేళ్లైంది. అప్పటికీ యామి గౌతమ్ ఎవరో నాకు తెలియదు. ఆమెతో పరిచయం కూడా లేదు. ఇదంతా నా ఇమేజ్‌ని దెబ్బతీసి అందరి దగ్గర సానుభూతి పొందడానికే శ్వేత ఇలా చేస్తుందని ఆరోపించాడు. దాచుకోవాల్సిన విషయాన్ని బహిర్గతం చేసి రచ్చ రచ్చ చేస్తోంది. ఆమె ఈవిధంగా ప్రవర్తిస్తుందని అస్సలు ఊహించలేదు. 
 
ఇక ఆమెతో ఎటువంటి సంప్రదింపులు సాగించను. శ్వేతతో నా వివాహ బంధం ముగిసినట్టేనని పులకిత్ సామ్రాట్ తేల్చిచెప్పేశాడు. ప్రస్తుతం ఈ హీరో యామి గౌతమ్‌తో ముంబైలో సహజీవనం చేస్తున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన శ్వేత మాట్లాడుతూ...పులకిత్, తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, మొదట్లో తమ కాపురం హ్యాపీగా సాగిందని, యామీ గౌతమ్తో తన భర్తకు పరిచయం ఏర్పడ్డాక తమ ఇద్దరి మధ్య కలతలు, కలహాలు చోటుచేసుకున్నాయని ఆరోపించింది. పులకిత్తో తాను విడిపోవడానికి యామీ గౌతమ్ కారణమని తేటతెల్లం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజినీకాంత్ 'కబాలి'కి తప్పని పైరసీ గండం... 180 పైరసీ లింకుల్లో లీక్...