Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 4 April 2025
webdunia

కన్నతండ్రి కమల్ హసన్ అయినా వేచి ఉండాల్సిందే..శ్రుతి అంత బిజీనా..

అన్నీ అనుకున్నట్లు జరిగితేనే సినిమా షూటింగులు సజావుగా సాగవు. ఇక ఏ కారణంవల్ల అయినా షూటింగ్ షెడ్యూల్ కేన్సిల్ అయితే నిర్మాతలు ఊపిరి ఆగిపోయినట్లే. ఎందుకంటే షూటింగ్ రద్దయిందని కమిట్ అయిన వేరే సినిమాలకు తారలు చెక్కేసారంటే మరిక దొరకరు. వారిని దొరకబుచ్చుకున

Advertiesment
Sanghamitra
హైదరాబాద్ , గురువారం, 20 ఏప్రియల్ 2017 (05:56 IST)
అన్నీ అనుకున్నట్లు జరిగితేనే సినిమా షూటింగులు సజావుగా సాగవు. ఇక ఏ కారణంవల్ల అయినా షూటింగ్ షెడ్యూల్ కేన్సిల్ అయితే నిర్మాతలు ఊపిరి ఆగిపోయినట్లే. ఎందుకంటే షూటింగ్ రద్దయిందని కమిట్ అయిన వేరే సినిమాలకు తారలు చెక్కేసారంటే మరిక దొరకరు. వారిని దొరకబుచ్చుకుని మళ్లీ షూటింగ్ తీయడం అంటే అతకంటే మించిన కష్టం ఉండదు.

 
ప్రస్తుతం కమల్ హసన్ వంటి సీనియర్ నటుడికి కూడా ఇదే సమస్య ఎదురైంది. కమల్ కాలిగాయం కారణంగా శభాష్ నాయుడు షూటింగుకు బ్రేక్ పడింది. దాంతో ఆర్టిస్టులందరూ ఈ సినిమాకి కేటాయించిన డేట్స్‌ వేస్ట్‌ అయ్యాయి. ఇప్పుడు కమల్‌ పూర్తిగా కోలుకున్నారు. కానీ షూటింగ్  ప్రారంభించాలంటే మిగతా ఆర్టిస్టులు అందుబాటులో ఉంటున్నారేమో కానీ కన్న కూతురే అందుబాటులో లేరు. 
 
సుందర్‌ సి దర్శకత్వంలో నటించే భారీ బడ్జెట్‌ ఫాంటసీ ఫిల్మ్‌ ‘సంఘమిత్ర’ కోసం కత్తి యుద్ధంలో శిక్షణ తీసుకుంటున్న శ్రుతిహసన్ ప్రస్తుతం లండన్‌‌లో షూటింగులో ఉన్నారు.  ఈ పరిస్థితి గురించి కమల్‌ మాట్లాడుతూ – ‘‘మా టీమ్‌ అందరిలో శ్రుతి బిజీ ఆర్టిస్ట్‌. అదృష్టవశాత్తూ నేను తండ్రిని కావడంతో నాకు (నా సినిమాకు) ప్రయారిటీ ఇస్తుందనుకుంటున్నా. కొన్ని వారాలు ఇండియాలో, కొన్ని వారాలు విదేశాల్లో చిత్రీకరణ చేయాలి. ఆగస్టు కల్లా చిత్రీకరణ పూర్తి చేయాలనుకుంటున్నా’’ అన్నారు కమల్ హసన్. 
 
కన్నతండ్రి అయినా సరే ఒకసారి షూటింగ్ రద్దయిందంటే హీరోయిన్ అయిన కన్న కూతురు కూడా అందుబాటులో లేని పరిస్థితి కమల్‌కి కొత్తేమరి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహానటిలో కీలకపాత్ర. ఇంకెవరిది.. అనుష్కదే..