Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యుద్ధ విద్యలు నేర్చిన 'సంఘమిత్ర' అస్త్రసన్యాసం చేసినందుకు ఇదా కారణం?

తమిళ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత భారీ చారిత్రక చిత్రం సంఘమిత్ర సినిమాలో కథానాయిక పాత్రకు ఎన్నికైన శ్రుతిహసన్ ప్రారంభంలో ఉప్పొంగిపోయారు. ఎలాగైనా సరే సంఘమిత్ర పాత్రలో జీవించాలని నిర్ణయించుకుని షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే యుద్ధవిద్యలు నేర్చుకోవడానికి ల

యుద్ధ విద్యలు నేర్చిన 'సంఘమిత్ర' అస్త్రసన్యాసం చేసినందుకు ఇదా కారణం?
హైదరాబాద్ , మంగళవారం, 30 మే 2017 (05:50 IST)
తమిళ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత భారీ చారిత్రక చిత్రం సంఘమిత్ర సినిమాలో కథానాయిక పాత్రకు ఎన్నికైన శ్రుతిహసన్ ప్రారంభంలో ఉప్పొంగిపోయారు. ఎలాగైనా సరే సంఘమిత్ర పాత్రలో జీవించాలని నిర్ణయించుకుని షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే యుద్ధవిద్యలు నేర్చుకోవడానికి లండన్‌లో వాలిపోయారు. నెలరోజులుగా అక్కడ శ్రుతి తీసుకుంటున్న ట్రెయినింగ్ గురించి మీడియా ఒక రేంజిలో రాసిపడేసింది. కానీ సోమవారం బాంబులాంటి వార్తతో అంతా నివ్వెరపోయారు. ఈ మెగా ప్రాజెక్టునుంచి శ్రుతిహసన్ తప్పుకున్నారన్న వార్త సుడిగాలిలా వ్యాపించింది. ఏంటి, ఎవరు కారణం, ఎలా అంటూ కథనాలు మొదలైపోయాయి.
 
‘‘ నా కెరీర్‌లోనే ప్రతిష్టాత్మక చిత్రంగా రూపొందనున్న ఈ సినిమా కోసం ఫిజికల్‌గానే కాదు.. మెంటల్‌గా కూడా చాలా ప్రిపేర్‌ అవుతున్నా. కొన్ని యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నా’’ అని శ్రుతీహాసన్‌ చెప్పి నెల రోజులు కూడా కాలేదు. ఈలోపు ఆమె ఉన్నట్లుండి ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ సినిమా ఏదో కాదు. ‘సంఘమిత్ర’. శ్రుతీహాసన్‌ లీడ్‌రోల్‌లో దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో సుందర్‌.సి రూపొందించనున్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను ఫ్రాన్స్‌లో జరిగిన  కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రిలీజ్‌ చేశారు. శ్రుతి కూడా అక్కడకు వెళ్లారు. ఆట్టహాసంగా టీజర్‌ విడుదల చేశారు. ఏఆర్ రహమాన్ ఆధ్వర్యంలో తయారైన ఆ టీజర్ సంచలనం కలిగించింది కూడా. 
 
అలాంటిది ఈ సినిమా నుంచి ఆమె ఎందుకు తప్పుకున్నారు ‘‘పూర్తి బౌండ్‌ స్క్రిప్ట్‌ అందజేయకపోవడం, షూటింగ్‌ షెడ్యూల్స్‌ గురించి సరిగ్గా క్లారిటీ ఇవ్వకపోవడంవల్లే శ్రుతి ఈ సినిమా నుంచి తప్పుకున్నారు’’ అని  ఆమె వ్యక్తిగత సిబ్బంది సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ‘‘కొన్ని అనివార్య కారణాల వల్ల శ్రుతీహాసన్‌తో ‘సంఘమిత్ర’ చేయలేకపోతున్నాం’’ అంటూ చిత్రనిర్మాణ సంస్థ శ్రీ తేనాండాల్‌ ఫిల్మ్స్‌  ప్రకటించింది. 
 
బాహబలి తాత లాంటి సినిమా తీసి చూపుతామని హెచ్చులు పోయిన తమిళ చిత్ర పరిశ్రమ ప్రధాన పాత్రధారిణే తప్పుకున్న ఈ పిడుగుపాటు నుంచి కోలుకుంటుందా.. కాలమే సమాధాని చెప్పాలి మరి. ఒకటి మాత్రం నిజం. సంఘమిత్ర అసాధారణ పాత్ర, ఆ పాత్రకు న్యాయం చేసే నటి, ఆ సినిమాను బాహుబలి స్థాయిలో తీసే దర్శకుడు, దన్నుగా నిలిచే నిర్మాత తోడయితే బాహుబలిని మించిన చిత్రం మాటేమిటో గానీ, తమిళ చిత్ర పరిశ్రమ గర్వించే సినిమా అయి తీరుతుంది. ప్రారంభంలోనే తగిలిన ఈ దెబ్బనుంచి చిత్రం యూనిట్ కోలుకోవాలని ఆశిద్దాం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలికి పోటీ అంటూ వచ్చిన సంఘమిత్ర.. శ్రుతి హసన్ ఔట్.. టీమ్‌కి ఏమైందో మరి