బాలీవుడ్‌లో మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు సంచలనంగా మారింది. తాజాగా ఈ కేసులో హీరో రణ్‌బీర్ కపూర్‌తోపాటు శ్రద్ధాకపూర్‌ను ఈడీ కోరినట్లు తెలుస్తోంది. ఇల్లీగల్ గేమింగ్ యాప్ కేసులో వీరి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తోన్న ఈడీ ఈ మేరకు సమన్లు చేసినట్లు తెలుస్తోంది.
గత నెలలో మహాదేవ్ బెట్టింగ్ యాప్‌కు సంబంధించి ముంబై, కోల్‌కతా, భోపాల్‌లోని 39 ప్రదేశాలలో జరిగిన ఆకస్మిక దాడుల్లో రూ.417 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 14 నుంచి 15 మంది సెలబ్రిటీలు, నటుల పాత్ర ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. మిగిలిన వారికి కూడా ఈడీ త్వరలో సమన్లు జారీ చేయనుంది.
మహదేవ్ యాప్‌పై ఇప్పటికే పలువురు తారలను ప్రశ్నించిన ఈడీ తాజాగా శ్రద్ధా కపూర్, రణ్బీర్ కపూర్‌లను ప్రశ్నించనుంది. ఈ కేసులో జరిగిన ఆర్థిక మోసాలపై విచారించనున్న కేంద్ర ఏజెన్సీ ముందు హాజరుకావడానికి రణ్‌బీర్ కపూర్ తనకు రెండు వారాలు గడువు కావాలంటూ ఈడీని కోరారు.
కాగా మహాదేశ్ యాప్ కేసులో ఇప్పటికే ప్రముఖ నటుడు రణ్‌బీర్ కపూర్, హాస్యనటుడు కపిల్ శర్మ, నటీమణులు హ్యూమా ఖురేషి, హీనా ఖాన్‌కు ఈడీ నుంచి సమన్లు జారీ అయ్యాయి.