Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళా శక్తితో పెట్టుకున్నాడు... వర్మను 52,000 మంది అలా చేయాలనుకుంటున్నారు....

రాంగోపాల్ వర్మ ఏదయినా వంకరటింకరగా మాట్లాడుతారనే పేరుంది. ఆయన ఎందులోనైనా వంకర మార్గాన్ని ఎంచుకుని వ్యాఖ్యానిస్తుంటారు. ఇప్పుడు అతివేగంగా ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చేయగల సామాజిక మాధ్యమాలు వుండటంతో ఆయన చెప్పేది కూడా అంతే వేగంగా వెళ్లిపోతోంది. #womensday

Advertiesment
మహిళా శక్తితో పెట్టుకున్నాడు... వర్మను 52,000 మంది అలా చేయాలనుకుంటున్నారు....
, గురువారం, 9 మార్చి 2017 (21:19 IST)
రాంగోపాల్ వర్మ ఏదయినా వంకరటింకరగా మాట్లాడుతారనే పేరుంది. ఆయన ఎందులోనైనా వంకర మార్గాన్ని ఎంచుకుని వ్యాఖ్యానిస్తుంటారు. ఇప్పుడు అతివేగంగా ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చేయగల సామాజిక మాధ్యమాలు వుండటంతో ఆయన చెప్పేది కూడా అంతే వేగంగా వెళ్లిపోతోంది. #womensday సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. 
 
కొందరయితే చెప్పులతో కొడతామంటూ ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా ఫిలిమ్ స్టూడియో సెట్టింగ్స్, అనుబంధ మజ్దూర్ యూనియన్ ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు వెల్లడించింది. మహిళలపై వర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వర్మను బాయ్ కాట్ చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ యూనియన్లో మొత్తం 52,000 మంది సభ్యులున్నారు. వారంతా ఆ నిర్ణయం తీసుకుంటే ఇక సినిమా నిర్మాతలపైనా ఒత్తిడి వస్తుందేమో. అలాగైతే ఇక వర్మ చెప్పుకున్నట్లే సినిమాలకు రిటైర్మెంట్ తప్పదేమో...?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిర్మాత నవీన్‌తో మలయాళ నటి భావన నిశ్చితార్థం... పెళ్లెప్పుడంటే...