Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రీతి జింటా సోదరుడి ఆత్మహత్య.. బిటౌన్ షాక్.. తుపాకీతో కాల్చుకున్నాడు.. 4పేజీల సూసైడ్ నోట్?

బాలీవుడ్ అందాల తార ప్రీతి జింటా సోదరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో బాలీవుడ్ షాక్ తింది. ప్రీతి జింటా సోదరుడు నితిన్ చౌహాన్ సిమ్లాలో శుక్రవారం ఉదయం తనను తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడి

Advertiesment
Shocking! Preity Zinta's cousin brother Nitin Chauhan commits suicide
, శనివారం, 3 డిశెంబరు 2016 (15:30 IST)
బాలీవుడ్ అందాల తార ప్రీతి జింటా సోదరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో బాలీవుడ్ షాక్ తింది. ప్రీతి జింటా సోదరుడు నితిన్ చౌహాన్ సిమ్లాలో శుక్రవారం ఉదయం తనను తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె కుటుంబీకులు తెలిపారు. ప్రీతీ జింటాకు కజిన్‌ బ్రదరైన నితిన్‌ చౌహాన్‌ వాహనంలో కూర్చుని తలపై తుపాకీ పేల్చుకున్నారు. 
 
అయితే శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం నితిన్‌ చౌహాన్‌ కనపడకపోయేసరికి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కారులో నితిన్‌ చౌహాన్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇంకా నాలుగు పేజీల సూసైడ్‌ నోట్‌ కూడా లభించిందని పోలీసులు వెల్లడించారు. 
 
నితిన్‌ చౌహాన్‌ భార్యతో విడాకుల కేసు కోర్టులో విచారణ జరుగుతోందని చెప్పారు. సూసైడ్‌ నోట్‌లో అత్తమామల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని అత్తమామలను విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
 
కాగా, బాలీవుడ్ సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింటా ప్రీతి తన ప్రేమికుడు, అమెరికాకి చెందిన ఫైనాన్షియల్‌ ఎనలిస్ట్‌ జీన్‌ గుడ్‌ఇనో‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 29న లాస్ ఏంజిలెస్‌లో వివాహం చేసుకున్న సంగతె తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రద్ధా కపూర్‌తో డేటింగ్‌కు సిద్ధమైన ఫర్హాన్.. ఫస్ట్ సహజీవనం.. ఆ తర్వాత పెళ్లి...